World Cup 2023 Semi Final Teams :2023 వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ చేరుకున్నాయి. లీగ్ స్టేజ్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది టేబుల్ టాపర్‌గా నిలిచింది భారత్. ఇక సెమీస్‌లో మరో రెండు బెర్త్‌ల కోసం నాలుగు జట్లు పోటీలో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 15న జరిగే తొలి సెమీ ఫైనల్ సమరంలో భారత్‌తో ఎవరు తలపడతారన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, శ్రీలంక సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా కూడా నాకౌట్ దశకు చేరుకుంది. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ల మధ్య పోటీ పడుతున్నాయి. అయితే ఇందులో ఆస్ట్రేలియా జట్టు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాల (10 పాయింట్లు)తో సెమీస్‌కు చేరేందుకు దగ్గర్లో ఉంది. దీనికి తోడు తన చివరి రెండు మ్యాచ్‌లను వరుసగా అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే అప్పుడు 14 పాయింట్లవుతాయి.
అయితే ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికాకు కూడా 14 పాయింట్లు సాధించే అవకాశముంది. ఒకవేళ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సమానంగా పాయింట్లు సాధిస్తే.. నెట్ రన్‌రేట్‌ను బట్టి ఏ టీమ్ 2, 3 స్థానాల్లో నిలుస్తాయో తెలుస్తుంది. ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ గెలిచినా సెమీస్ చేరుతుంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే.. మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.