Surya Kumar Yadav Injury Update :వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్‌తో ఆడనున్న మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కివీస్‌తో మ్యాచ్‌కు దూరం కాగా.. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా గాయపడ్డారు. ధర్మశాలలోని హెచ్‌పీసీఎ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా ఇషాన్ కిషన్‌కు తేనెటీగ కుట్టగా.. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మణికట్టుకు గాయమైంది.
ప్రాక్టీస్ చేస్తుండగా బంతి.. సూర్య కుడి చేతి మణికట్టుకు బలంగా తాకినట్లు సమాచారం. వెంటనే మెడికల్ స్టాప్ ఐస్ ప్యాక్‌ను పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే సూర్య గాయంపై ఐస్‌ప్యాక్ పెట్టగా.. నొప్పి తగ్గినట్లు తెలుస్తోంది. ఎక్స్‌రే అవసరం లేదని సమాచారం.
Ishan Kishan Injury Update : కివీస్‌తో మ్యాచ్‌కు హార్దిక్ స్ధానంలో సూర్యకుమార్ యాదవ్ రానున్నట్లు వార్తలు వినిపించాయి. అంతలోనే సూర్యకు గాయం కావడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. మరోవైపు తేనెటీగ కుట్టడం వల్ల నొప్పితో విల్లవిల్లాడిన కిషన్‌కు బీసీసీఐ వైద్య బృందం చికిత్స అందించింది. కంటి పైభాగంలో తేనెటీగ కుట్టడంతో బాగా ఉబ్బినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరికి సంబంధించి బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.