SA vs NZ WORLD CUP 2023 :2023 వరల్డ్ కప్‌లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి నిర్ణీత 50 ఓవర్లలో 357 పరుగులు చేసింది. ఓపెనర్ డీకాక్, వాన్‌డెర్ డసెన్ సెంచరీలతో అదరగొట్టారు. అనంతరం 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 167 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్ (60; 50 బంతుల్లో 4x4, 4x6) టాక్ స్కోరర్‌గా నిలిచాడు. విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. మిగతా ప్లేయర్లందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. డేవాన్ కాన్వే (2), రచిన్ రవీంద్ర (9), టామ్ లేథమ్ (4), మిచెల్ శాంట్నర్ (7), జేమ్స్ నీషమ్ (0) తీవ్రంగా నిరాశపర్చారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. మార్కో జాన్సన్ 3, గెరాల్డ్ కోయెట్జీ 2 వికెట్లు తీయగా.. కగిసో రబాడ ఒక వికెట్ పడగొట్టారు. ఈ భారీ విజయంతో దక్షిణాప్రికా జట్టు నెట్‌రన్‌రేట్‌ను మరింత మెరుగుపర్చుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో భారత్‌ను వెనక్కినెట్టి మొదటి స్థానానికి ఎగబాకింది.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (114; 116 బంతుల్లో 10x4, 3x6) మరోసారి చెలరేగాడు. అయితే ఈ ప్రపంచకప్‌లో అతడికిది నాలుగో సెంచరీ. వాండర్ డసెన్ (133; 118 బంతుల్లో 9x4, 5 x6) కూడా సెంచరీ బాదాడు. ఓపెనర్ తెంబా బావుమా (24) పరుగులు చేయగా.. చివర్లో డేవిడ్ మిల్లర్ (53; 30 బంతుల్లో 2x4, 4x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 2, ట్రెంట్ బౌల్ట్, నీషమ్ ఒక్కో వికెట్ తీశారు.