తెలంగాణ

telangana

ETV Bharat / sports

Rohit Sharma World Cup 2023 : మెగా సమరంలో రోహిత్​ రికార్డులు.. హిట్‌మ్యాన్ విధ్వంసానికి కారణమిదే!

Rohit Sharma World Cup 2023 : వన్డే ప్రపంచకప్​లో భాగంగా అక్టోబర్​ 11న జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్​ శర్మ శతకొట్టాడు. క్రీజులోకి దిగి అద్భుతమైన ఇన్నింగ్స్​ ఆడిన హిట్​ మ్యాన్​.. భారీ స్కోర్​ను సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 84 బంతుల్లో 131 పరుగులు తీసి.. సచిన్ రికార్డ్​ను బ్రేక్​ చేయడమే కాకుండా.. 63 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకుని వరల్డ్​ కప్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ప్లేయర్​గా రికార్డుకెక్కాడు. ఇలా ఈ టీమ్ఇండియా కెప్టెన్​ నెలకొల్పిన రికార్డులు మరిన్ని ఉన్నాయి. అవేంటంటే ?

Rohit Sharma World Cup 2023
Rohit Sharma World Cup 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 4:33 PM IST

Rohit Sharma World Cup 2023 : అతడు పది ఓవర్లు క్రీజ్‌లో ఉన్నాడంటే ఇక ప్రత్యర్థులు మ్యాచ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. కుదురుకున్నాడంటే ఇక ఆ రోజు చాలా రికార్డులు గల్లంతైనట్లే అని అనుకోవాల్సిందే. బ్యాట్​ పట్టుకుని అలవోకగా సిక్స్‌లు కొట్టేయగల సమర్థుడు అతను. ముఖ్యంగా ప్రపంచ కప్‌ అంటే గాడ్‌ మోడ్‌లోకి మారిపోతాడు ఆ స్టార్​ బ్యాటర్​. మెగా సమరంలో పరుగుల ఎలా పారించాలో అతడికి బాగా తెలుసు. ఇంత పెద్ద టోర్నీకి తొలిసారి జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ.. ఎక్కడా ఆ ఒత్తిడి కనిపించలేదు. ఇప్పటికే అర్థమైపోయిందిగా ఎవరా అతడని? అతనెవరో కాదు మన హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ.

అక్టోబర్​ 11న జరిగిన మ్యాచ్​లో శతకొట్టిన రోహిత్​.. 84 బంతుల్లో 131 పరుగులు తీసి.. సచిన్ రికార్డ్​ను బ్రేక్​ చేయడమే కాకుండా.. 63 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకుని వరల్డ్​ కప్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ప్లేయర్​గా రికార్డుకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ ఇన్‌స్వింగర్‌కు బలైనప్పటికీ.. ఆ ప్రభావం ఈ మ్యాచ్‌లో ఎక్కడా చూపించలేదు. బ్యాట్‌తో అఫ్గాన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఈ ఒక్క మ్యాచ్​తో ఇప్పటికే సచిన్‌, క్రిస్‌ గేల్‌ రికార్డులతో పాటు పలు రికార్డులను తన తన ఖాతాలో వేసుకున్నాడు.

వరల్డ్‌ కప్‌ల్లో విధ్వంసం..
Rohit Sharma World Cup Stats :ద్వైపాక్షిక సిరీసుల్లో సారధిగా రోహిత్​కు మంచి రికార్డు ఉంది. అయితే, బ్యాటర్‌గా వన్డే ప్రపంచ కప్‌ మెగా టోర్నీల్లో అద్భుతంగా ఆడిన ఈ స్టార్​ ప్లేయర్.. ఇప్పుడు ఆడేది మూడో వరల్డ్‌ కప్‌ అయినా సరే.. ఐదు ప్రపంచకప్‌లు ఆడిన వారికి కూడా సాధ్యం కాని విధంగా ఏడు సెంచరీలను నమోదు చేశాడు. అందుకే, విరాట్ కోహ్లీ లక్ష్య ఛేదనలో కింగ్‌ అయితే.. రోహిత్ 'వరల్డ్‌ కప్‌ హీరో' అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఏడు శతకాలు బాదడం చూస్తేనే.. అతడి విధ్వంసం ఏస్థాయిలో ఉంటుందో అందరికీ తెలుస్తోంది. ఇందులో మూడు సెంచరీలు లక్ష్యఛేదన సమయంలోనే కావడం విశేషం. ప్రస్తుతం అతడి ఫామ్‌ను చూస్తుంటే ఈ టోర్నీలో శతకాల సంఖ్య 10కి చేరినా మనం అస్సలు ఆశ్చర్యపోనక్కర్లేదు. 2015 వరల్డ్‌ కప్‌లో ఒకటి, 2019లో ఏకంగా ఐదు సెంచరీలు సాధించాడు.

సిక్స్‌లు అలా కొట్టేందుకు కారణమదే..
Rohit Sharma World Cup Sixes :రోహిత్ శర్మ సిక్స్‌లను అలవోకగా కొడతాడని మనకు తెలుసు. తాజాగా అఫ్గాన్​తో జరిగిన మ్యాచ్​లోనూ ఐదు సిక్స్‌లు బాదేశాడు. ఇతర బ్యాటర్లతో పోలిస్తే బంతిని కాస్త ముందుగానే అంచనా వేసి షాట్‌ కొట్టడంలో రోహిత్​ దిట్ట. అతని అద్భుతమైన టైమింగ్‌ దీనికి కారణం.

ఇదొక్కటి సాధిస్తే..
World Cup 2023 Team India :దాదాపు పదేళ్ల నుంచి ఐసీసీ టైటిల్‌ కోసం భారత్ నిరీక్షిస్తోంది. చివరి సారిగా ఎంఎస్ ధోనీ నాయకత్వంలో (2013) ఛాంపియన్స్‌ ట్రోఫీని ముద్దాడిన భారత జట్టు.. అంతకుముందు 2011వరల్డ్‌ కప్‌ను కూడా ధోనీ సారథ్యంలో గెలుపొందింది. ఆ తర్వాత వన్డే, టీ20 ప్రపంచకప్‌లు జరిగినప్పటికీ.. ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. ఈసారి మాత్రం అన్నీ శుభ శకునాలుగానే కనిపిస్తున్నాయి.

తాజాగా ఆరు దేశాలు తలపడిన ఆసియా కప్‌ను కూడా భారత్‌ సొంతం చేసుకోవడం విశేషం. వన్డే ప్రపంచకప్‌లోకి అడుగు పెట్టే సమయానికి మూడు ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌ అయింది. ఇటు రాహుల్‌ వంటి ఆటగాళ్లూ అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చేశారు. వరల్డ్‌ కప్‌లోనూ శుభారంభం లభించింది. ఇదే ఒరవడిని కొనసాగించి ముచ్చటగా మూడో వరల్డ్‌ కప్‌ను రోహిత్ నాయకత్వంలో జట్టు ముద్దాడాలని క్రికెట్​ లవర్స్ కోరుకుంటున్నారు.

Ind vs Afg World Cup 2023 : భారత్xఅఫ్గానిస్థాన్​ మ్యాచ్​లో నమోదైన రికార్డులు.. ప్రపంచకప్​ ఛేజింగ్​లో ఏకైక జట్టుగా టీమ్ఇండియా ఘనత

ODI World Cup 2023 IND VS AFG : రోహిత్​ సెన్సేషనల్​ సెంచరీ... టీమ్ఇండియా వరుసగా రెండో విజయం

ABOUT THE AUTHOR

...view details