తెలంగాణ

telangana

ETV Bharat / sports

ODI World Cup SL vs AUS : శ్రీలంక చెత్త రికార్డ్​.. వెన్నునొప్పితోనే ఆ జట్టును బెంబేలెత్తించిన ఆసీస్​ ప్లేయర్ - ప్రపంచకప్​ 203

ODI World Cup SL vs AUS : వరల్డ్​ కప్​ 2023లో ఆసీస్​తో జరిగిన మ్యాచ్​లో శ్రీలంక ఓటమితో చెత్త రికార్డును మూటగట్టుకుంది. అత్యధిక మ్యాచ్​ల్లో పరాజయాలు పొందిన జట్టుగా నిలిచింది. వెన్నునొప్పి సమస్యతోనే బరిలోకి దిగి తన జట్టుకు తొలి విజయాన్ని అందించాడు జంపా.

ODI World Cup  SL vs AUS : శ్రీలంక చెత్త రికార్డ్​.. వెన్నునొప్పితోనే ఆ జట్టును బెంబేలెత్తించిన ఆసీస్​ ప్లేయర్
ODI World Cup SL vs AUS : శ్రీలంక చెత్త రికార్డ్​.. వెన్నునొప్పితోనే ఆ జట్టును బెంబేలెత్తించిన ఆసీస్​ ప్లేయర్

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 11:03 AM IST

Updated : Oct 17, 2023, 11:57 AM IST

ODI World Cup SL vs AUS : ప్రపంచకప్​ 2023లో హ్యాట్రిక్​ ఓటమితో శ్రీలంక చెత్త రికార్డును మూటగట్టుకుంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో శ్రీలంక ఐదు వికెట్ల తేడా ఓటమిపాలైంది. దీంతో లంక ప్రపంచకప్​లో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్​ ముందు వరకు ఈ చెత్త రికార్డు జింబాబ్వే పేరిట ఉండేది. తాజా ఓటమితో శ్రీలంక.. జింబాబ్వేతో పాటు చేరింది. ప్రస్తుతం ఈ రెండు టీమ్​లు ప్రపంచకప్​లో 42 పరాజయాలతో చెత్త రికార్డును పంచుకున్నాయి. 35 మ్యాచ్​ల ఓటమితో మూడో స్థానంలో వెస్టిండీస్​ ఉంది. 34 పరాజయాలతో ఇంగ్లాండ్​​ నాలుగో స్థానంలో నిలచాయి.

వెన్నునొప్పితో బరిలోకి దిగి.. ప్రపంచ కప్​లో శ్రీలంకపై ఆసీస్ గెలిచి ఖాతాను ఓపెన్​ చేసింది. ఈ ఎడిషన్​లో ఆసీస్​ ఆడిన తొలి రెండు మ్యాచ్​ల్లోనూ ఓటమినే చవిచూసింది. లంకపై జరిగిన మ్యాచ్​లో ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్​లో ఆసీస్​ మొదట్లో తడపడినా.. ప్రత్యర్థులను ఎదుర్కొని విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించి.. మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు ఆడమ్​ జంపా. వెన్ను నోప్పితో బాధపడుతూనే బరిలోకి దిగి.. ప్రస్తుత ప్రపంచకప్​లో తన జట్టుకు మొదటి విజయాన్ని అందించాడు. నొప్పిని దిగమింగుతూనే కీలక వికెట్లు పడగొట్టి లంక పరాజయానికి కారణమైయ్యాడు.

ఫామ్​లో ఉన్న శ్రీలంక బ్యాటర్లు కుశాల్ మెండిస్​, సమరవిక్రమ, చమిక కరుణరత్నేలతో పాటు తీక్షణ వికెట్లను జంపా పడగొట్టాడు. మెండిస్​, సమరవిక్రమలను వెంటవెంటనే జంపా పెవిలియన్​కు పంపించాడు. ఆఖర్లో రెండు పరుగుల వ్యవధిలో కరుణరత్నే, తీక్షణ వికెట్లు తీసి లంక ఇన్నింగ్స్​కు చరమగీతం పాడాడు. నొప్పిని భరస్తూనే నాలుగు వికెట్లు పడగొట్టి ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డును దక్కించుకున్నాడు.

అయితే ఆసీస్ ఆడిన తొలి రెండు మ్యాచ్​ల్లో జంపా సరైన ప్రదర్శన చేయలేదు. టీమ్​ఇండియా జరిగిన తొలి మ్యాచ్​లో జంపా.. ఒక్క వికెట్ కూడా తీయకుండా53 పరుగులు ఇచ్చాడు. తర్వాత తలపడిన దక్షిణాఫ్రికా మ్యాచ్​లోనూ 10 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే తీసి ఏకంగా 70 పరుగులు ఇచ్చాడు.

Australia Vs Sri lanka World Cup 2023 : ఎట్టకేలకు బోణీ కొట్టిన కంగారూలు.. శ్రీలంక హ్యాట్రిక్ ఓటమి

ODI World Cup 2023 Semi Final : సెమీస్​ రేస్​.. లెక్క తప్పింది సార్​.. వేడి రాజుకుంది!

Last Updated : Oct 17, 2023, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details