తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీలంకతో మ్యాచ్​లో టీమ్ఇండియా లక్ష్యం అదొక్కటే!

India Vs Sri Lanka World Cup 2023 : 2023 వన్డే వరల్డ్​కప్‌లో సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్న టీమ్ఇండియా.. పాయింట్స్​ టేబుల్​లో మొదటి స్థానంలోనే ఉండాలంటే మిగతా మ్యాచుల్లోనూ గెలిచి తీరాలి. ఈ నేపథ్యంలో గురువారం శ్రీలంకతో ముంబయి వేదికగా టీమ్‌ఇండియా తలపడనుంది.

India Vs Sri Lanka World Cup 2023
India Vs Sri Lanka World Cup 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 10:47 PM IST

India Vs Sri Lanka World Cup 2023 : 2023 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్​ఇండియా మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మహా సంగ్రామంలో ఆడిన ఆరు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రోహిత్‌ సేన.. శ్రీలంకను ఢీ కొట్టబోతుంది. గురువారం ముంబయి వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. అయితే, ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా టార్గెట్​ ఆ 'ఒక్కటే' అయి ఉండాలి.

బౌలర్లు.. బ్యాటర్లు.. ఒకరికొకరు భరోసా..
ODI World Cup 2023 : ఆడిన ఆరు మ్యాచ్​లు గెచిలిన టీమ్​ఇండియా ఖాతాలో ప్రస్తుతం12 పాయింట్లు ఉన్నాయి. ఇంకా మూడు మ్యాచ్​ల్లో భారత తన ప్రత్యర్థులతో తలపడాల్సి ఉంది. అయితే ఇతర టీమ్​లతో పోలిస్తే భారత్​కే గెలిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచుల్లో భారత్‌ మినహా అన్ని జట్లూ కనీసం ఒక్కో మ్యాచ్​లో ఓడిపోయాయి. టీమ్ఇండియా మాత్రమే వరుస విజయాలతో కొనసాగుతోంది. ఇక మిగిలి మ్యాచుల్లోనూ గెలిస్తే నెంబర్‌వన్‌ స్థానంతో 'టాపర్‌ ఆఫ్‌ ది టోర్నీ'గా సెమీస్‌లోకి ఎంట్రీ ఇస్తుంది.

ఇప్పటికే బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఎదుర్కొన్న అన్ని పరీక్షలను భారత్​ గట్టెక్కింది. అయితే బ్యాటింగ్‌లో ఇబ్బందలు ఎదుర్కొన్నప్పుడు బౌలర్లు 'మేము ఉన్నాం' అంటూ జట్టును విజయ తీరాలకు తీసుకెళ్లారు. ఇక బౌలర్లు చేసిన శ్రమను వృథా చేయకుండా బ్యాటర్లు కూడా మిగతా మ్యాచుల్లో జట్టును గెలిపించారు. మహ్మద్ షమీ, జస్​ప్రీత్ బుమ్రా పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. ఇక బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. శ్రేయస్‌ ఫామ్‌ పరిస్థితి కాస్త ఆందోళనగానే ఉన్నా.. క్రీజ్‌లో కుదురుకోగలిగితే మంచి ఇన్నింగ్స్‌ ఆడగల సత్తా అతడి ఉంది.

జట్టులో మార్పులు ఉంటాయా?
ఇంగ్లాండ్‌తో ఆడిన జట్టే శ్రీలంకతోనూ ఆడనుందా ..? ఇదే కనుక నిజమైతే ఈ మ్యాచ్‌లో కూడా హార్దిక్‌ పాండ్య దూరంగా ఉంటాడు. ముంబయి పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా. ఈ నేపథ్యంలో స్పిన్నర్‌ను అదనంగా తీసుకొనే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్‌ నెట్స్‌లో విపరీతంగా ప్రాక్టీస్​ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే పేస్‌ ఆల్‌రౌండర్ శార్దూల్‌ ఠాకూర్‌ను తీసుకుంటే అదనంగా బ్యాటర్‌ కూడా అందుబాటులో ఉన్నట్లవుతుంది. గత రెండు మ్యాచ్​ల్లో పెద్దగా రాణించలేకపోయిన మహ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టి అశ్విన్ లేదా..? శార్దూల్‌ ఠాకూర్​ను జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మనదే ఆధిపత్యం!
ఇండియా - శ్రీలంక టీమ్​ల మధ్య ఇప్పటి వరకు జరిగిన వన్డేల్లో మనదే ఆధిపత్యం. మొత్తం 167 వన్డేల్లో ఇరు జట్లు తలపడగా.. 98 మ్యాచుల్లో భారత్ గెలుపొందింది. శ్రీలంక 57 వన్డేల్లో విజయం సాధించింది. ఇక మరో 11 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఓ మ్యాచ్​ టైగా ముగిసింది. ఇటీవల భారత్​-శ్రీలకం జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచుల్లో కూడా టీమ్‌ఇండియా విజయం సాధించడం గమనార్హం. ఇందులో ఆసియా కప్‌ ఫైనల్‌లో కేవలం 50 పరుగులకే లంకను భారత జట్టు కుప్పకూల్చింది. సిరాజ్‌ ఏకంగా ఆరు వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోలేని దెబ్బకొట్టాడు. గురువారం నాటి మ్యాచ్​లో కూడా మరోసారి సిరాజ్‌ మియా నుంచి అలాంటి ప్రదర్శన రావాలి.

అంతకుముందు ఆసియా కప్‌ సూపర్‌- 4 మ్యాచ్‌లోనూ భారత్​ చేతిలో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ప్రస్తుత 2023 వరల్డ్‌ కప్‌లో పాథుమ్‌ నిస్సంక, కుశాల్ మెండిస్‌, సదీరా సమరవిక్రమ వంటి బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. మధుశంక, వెల్లలాగే, కసున్‌ రజిత, తీక్షణతో జాగ్రత్తగా ఉండాల్సిందే. వీరందరికీ సబ్​కాంటినెంట్ పిచ్‌లు బాగా అలవాటు ఉన్నాయి. ఏకొద్దిగా ఏమరుపాటుగా ఉన్నా షాక్‌ తగిలే ప్రమాదమూ లేకపోలేదు. వన్డే వరల్డ్​ టోర్నీ చరిత్రలో ఇరు జట్లూ 9 మ్యాచుల్లో తలపడ్డాయి. చెరో నాలుగింటిలో గెలుపొందడం విశేషం. ఇక ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఏదేమైనా ఇలాంటి మెగా టోర్నీల్లో శ్రీలంక.. తమ శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి చివరి వరకు పోరాడుతుందనేదానికి ఇదొక ఉదాహరణ. ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా భారత్​ తన ప్రత్యర్థితో తలపడాల్సిందే.

ఆటతీరు బాగోలేదని చెప్పి సూర్యకుమార్​కు షాకిచ్చిన అభిమాని

దక్షిణాఫ్రికా చేతిలో కివీస్ చిత్తు, సెంచరీలతో అదరగొట్టిన డీకాక్​, డసెన్​

ABOUT THE AUTHOR

...view details