India Vs Netherlands World Cup 2023 :2023 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం నెదర్లాండ్స్‌తో తలపడిన టీమ్ఇండియా 160 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో భారత్ ఎదురు లేకుండా సెమీస్‌కు చేరింది. మరోవైపు ఓటమి పాలైన నెదర్లాండ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే తాము ఓడిపోయినా తల ఎత్తుకునే ఇంటికి వెళ్తున్నామని డచ్ క్రికెబోర్డు తెలిపింది. అంతే కాకుండా భారత్ బ్యాటింగ్ లైనప్‌ను అనేక తలలున్న రాక్షసుడిగా అభివర్ణించింది. భారత్‌ను గెలవడం చాలా కష్టం అని తెలిపింది.
'భారత్ బ్యాటింగ్ లైనప్, అనేక తలలున్న రాక్షసుడు'
టీమ్ఇండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు. భారత్ బ్యాటింగ్ లైనప్‌ను.. చాలా తలల ఉన్న రాక్షసుడిలా అభివర్ణించింది. ఒక స్టార్ బ్యాటర్ ఔట్ అయితే.. తదుపరి ఆటగాడు ఏం తక్కువ కాదని కొనియాడింది. కేవలం 21 ఓవర్లలో నాలుగో వికెట్‌కు.. శ్రేయస్ అయ్యర్ (128), కేఎల్ రాహుల్ (102).. 208 పరుగుల భాగస్వామ్యంతో ఈ విషయాన్ని నిరూపించారని మెచ్చుకుంది.
తల ఎత్తుకుని వెళ్లిపోతున్నాం!
ఆదివారం జరిగిన మ్యాచ్‌పై నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు స్పందించింది. 'డచ్ ప్లేయర్లు తమ చివరి ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ చేతిలో ఓడిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 410 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం డచ్ 250 పరుగులు చేసింది. ఇది డచ్ టీమ్‌కు ఒక పెద్ద నష్టం. కానీ ఇప్పటికే నెదర్లాండ్స్.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై చారిత్రాత్మక విజయాలతో తల ఎత్తుకుని టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తోంది' అని ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది.