తెలంగాణ

telangana

ETV Bharat / sports

కుల్దీప్​@250, జడేజా 6 వేల పరుగులు- టీమ్​ఇండియా ప్లేయర్లు కొల్లగొట్టిన రికార్డులివే!

IND Vs SA World Cup 2023 Records : 2023 ప్రపంచకప్​లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో విరాట్ కోహ్లీతో పాటు ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా, స్పిన్నర్​ కుల్దీప్ యాదవ్​ అధ్బుతమైన ఫీట్లు సాధించారు. అవేంటంటే?

IND Vs SA World Cup 2023 Records
IND Vs SA World Cup 2023 Records

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2023, 8:35 AM IST

Updated : Nov 6, 2023, 10:31 AM IST

IND Vs SA World Cup 2023 Records : 2023 ప్రపంచకప్​లో టీమ్ఇండియా ఎదురులేకుండా దూసుకుపోతోంది. వరుసగా 8 మ్యాచ్​లు గెలిచి సత్తా చాటింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో అటు బ్యాట్​తో ఇటు బంతిలో అద్భుత విన్యాసాలు చేశారు భారత ప్లేయర్లు. పుట్టినరోజు నాడు సెంచరీ కొట్టి అభిమానులకు స్పెషల్ కానుక ఇచ్చిన కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్​లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్​గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ సరసన నలిచాడు. మరోవైపు టీమ్ఇండియా డేరింగ్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా, స్పిన్నర్ కుల్దీప్​ యాదవ్​లు కూడా అద్భుతమైన ఫీట్లు సాధించారు.

6 వేల పరుగుల ఆల్​రౌండర్​..!
ఆదివారం సఫారీలతో జరిగిన మ్యాచ్​లో 5 వికెట్లు తీసి వీర విహారం చేసిన రవీంద్ర జడేజా.. 193 స్ట్రైక్​ రేట్​తో 15 బంతుల్లో 29* (3x4, 1x6) పరుగులు చేశాడు. ఆదివారం మ్యాచ్​ సహా 325 మ్యాచ్​లు ఆడిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్​లో 6 వేల (6,008) పరుగులు పూర్తి చేసుకున్నాడు. 33.37 సగటు, 70పైగా స్ట్రైక్​ రేట్​తో ఈ ఫీట్​ సాధించాడు.

కుల్దీప్​ యాదవ్@250
కోల్​కతా ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ఫీట్​ సాధించాడు. ఈ మ్యాచ్​లో 5.1 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్​లో 250 వికెట్లు పూర్తి చేసుకుని.. అత్యధిక వికెట్లు తీసిన భారతీయుల జాబితాలో 19వ స్థానంలో నిలిచాడు. 138 మ్యాచ్​ల్లో 22.62 సగటుతో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో 953 వికెట్లతో అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు.

ఈ మ్యాచ్​లో భారత ప్లేయర్లు నమోదైన రికార్డులు..

  • వరల్డ్​కప్​లో విరాట్ ఇప్పటివరకు 34 మ్యాచ్​ల్లో కలిపి.. 1573 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సచిన్ (2278), రికీ పాంటింగ్ (1743), మాత్రమే విరాట్ కంటే ముందున్నారు.
  • సౌతాఫ్రికాపై అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్​గా సచిన్​ (5)ను విరాట్ సమం చేశాడు. అయితే సచిన్ 57 మ్యాచ్​ల్లో ఈ ఘనత సాధించగా.. విరాట్ 31 మ్యాచ్​ల్లోనే అందుకున్నాడు.
  • స్వదేశంలో వన్డేల్లో విరాట్ 6000+ పరుగులు నమోదు చేశాడు. ఈ జాబితాలో విరాట్ (6046) కంటే ముందు.. సచిన్ (6796) మాత్రమే ఉన్నాడు. వీరిద్దరి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (4590) మూడో స్థానంలో ఉన్నాడు.
  • వరల్డ్ కప్​ల్లో 1500 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారతీయుడిగా కోహ్లీ నిలిచాడు. మొదటి స్థానంలో సచిన్ ఉన్నాడు.
  • ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక వన్డే సిక్సర్లు (58)బాదిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఎబీ డివిలియర్స్‌ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు.

సునీల్ నరైన్ షాకింగ్ డెసిషన్ - ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై

సఫారీలనూ చిత్తు చేసిన టీమ్ఇండియా - జడ్డూ మ్యాజిక్​కు సౌతాఫ్రికా విలవిల

Last Updated : Nov 6, 2023, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details