Glenn Maxwell Injury Update : 2023 ప్రపంచ కప్‌లో వరుస విజయాలతో దుసుకుపోతున్న ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. మ్యాచ్ లేనందువల్ల గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన మ్యాక్స్‌వెల్.. గోల్ఫ్ కార్ట్ వెనుక ప్రయాణిస్తున్నప్పుడు జారి కింద పడిపోయాడు. దీంతో అతడి తలకు గాయం అయింది. ఈ మేరకు ఆసీస్ హెడ్ కోచ్ అండ్రూ మెక్‌డోనాల్డ్ తెలిపారు.
Australia Vs England World Cup 2023 : ఏడాది కాలంలో మ్యాక్స్‌వెల్‌కు ఇది రెండో గాయం. గత నవంబర్‌లో మెల్బోర్న్లో జరిగిన ఓ పుట్టిన రోజు పార్టీలో మ్యాక్స్‌వెల్ కాలు విరిగింది. అయితే ఆ గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఇంతలో ఈ ఘటన జరగడం వల్ల అతడి ఆట తీరుపై ప్రభావం చూపే అవకాశముంది. ఇదిలా ఉండగా.. ఖాళీ సమయం దొరకడం వల్ల ప్లేయర్లు గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని ఇంగ్లాండ్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపారు. అయితే అతడి స్థానంలో రిప్లేస్మెంట్ అవసరం లేదని చెప్పారు. ప్రోటోకాల్స్ ప్రకారం.. అతడు 6-8 విరామం తీసుకుంటాడని తెలిపారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ఇప్పుడున్న స్క్వాడ్ నుంచే ప్లేయర్‌ను తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం మార్కస్ స్టోయినిస్, కామెరూన్ గ్రీన్ అందుబాటులో ఉన్నారని.. కానీ తాము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు.