తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెంచరీతో అదరగొట్టిన స్టోక్స్​- నెదర్లాండ్స్​పై ఇంగ్లాండ్ ఘన​ విజయం - నెదర్లాండ్​పై ఇంగ్లాండ్​ విజయం

England Vs Netherlands World Cup 2023 : వరల్డ్​ కప్​లో భాగంగా నెదర్లాండ్స్​తో తలపడిన మ్యాచ్​లో 160 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ 179 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

England Vs Netherlands World Cup 2023
England Vs Netherlands World Cup 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 10:15 PM IST

Updated : Nov 9, 2023, 6:16 AM IST

England Vs Netherlands World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 160 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 339 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో బెన్‌ స్టోక్స్‌ శతకం (108; 84 బంతుల్లో 4x6, 6x6)తో అదరగొట్టాడు. మరో బ్యాటర్​ డేవిడ్ మలన్‌ (87), క్రిస్‌ వోక్స్‌ (51) అర్ధశతకాలతో రాణించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగుల చేసింది. నెదర్లాండ్స్‌ బౌలర్లలో బాస్‌ డి లీడ్‌ 3 వికెట్లు తీశాడు. ఆర్యన్‌, వాన్‌ బీక్‌ చెరో 2 వికెట్లు, వాన్‌ మెకెరన్‌ ఒక వికెట్‌ తీశాడు.

అనంతరం ఇంగ్లాండ్‌ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌.. 37.2 ఓవర్లకు 179 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. నెదర్లాండ్స్‌ బ్యాటర్లు స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (38), వెస్లీ (37), సైబ్రండ్‌ (33) రాణించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ, అదిల్‌ రషీద్‌ 3 వికెట్లు చొప్పున, డేవిడ్‌ విల్లీ 2, క్రిస్‌ వోక్స్‌ ఒక వికెట్ తీశారు. దీంతో నెదర్లాండ్స్‌పై ఇంగ్లాండ్‌ 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇక ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌ ఆట హైలైట్​గా నిలిచింది. మొదట ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన స్టోక్స్​ ఆఖర్లో చెలరేగిపోయాడు. తొలుత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్‌.. 48 పరుగుల వద్ద బెయిర్‌స్టో (15) వికెట్‌ను కోల్పోయింది. అయితే జో రూట్‌ (28) సహకారం వల్ల మలన్‌ చెలరేగడంతో 21వ ఓవర్లో 133/1తో బలమైన స్థితిలో నిలిచి భారీ స్కోరు చేసింది. కానీ చకచకా వికెట్లు చేజార్చుకుని 36వ ఓవర్లో 192/6తో నిలిచింది. కానీ వోక్స్‌, స్టోక్స్‌ చక్కని బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. 44వ ఓవర్లకు స్కోరు 246/6. కానీ ఆఖర్లో స్టోక్స్‌ విరుచుకుపడ్డాడు. అతడు ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లు బాదడం వల్ల చివరి నాలుగు ఓవర్లలో ఇంగ్లాండ్‌ ఏకంగా 93 పరుగులు సాధించింది. వోక్స్‌తో ఏడో వికెట్‌కు 129 పరుగులు జోడించిన స్టోక్స్‌.. ఆఖరి ఓవర్లో.. తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే స్టోక్స్‌ 78 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డుకెక్కాడు. ప్రపంచకప్‌లో అతడికి ఇదే తొలి సెంచరీ. డచ్‌ బౌలర్లలో డి లీడ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్‌ దత్‌, వాన్‌ బీక్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఆ షాట్​ వల్ల జో రూట్ ఔట్​ - తొలి సారి మాత్రం అలా!

ODI World Cup 2023 : ప్రపంచకప్​లో సంచలనాలు.. మొన్న అఫ్గాన్, నిన్న 'డచ్​'.. వీరితో జాగ్రత్త బాసూ!

Last Updated : Nov 9, 2023, 6:16 AM IST

ABOUT THE AUTHOR

...view details