Marriage Proposal to Mohammed Shami: 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా పేసర్ షమీ (Mohammed Shami) మంచి జోరు మీదున్నాడు. ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా.. ఏకంగా 16 వికెట్లు తీసి దుమ్ములేపాడు. దీంతో.. టాక్ ఆఫ్ ది టోర్నీ అయ్యాడు. అతని ప్రదర్శనపై ఇటీవల మాజీ భార్య హసీన్ జహాన్ కూడా కామెంట్ చేసింది. తాజాగా బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ స్పందించింది. అతన్ని మెచ్చుకోవడమే కాదు.. ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానంటూ చెప్పుకొచ్చింది. దీంతో.. సోషల్ మీడియాలో షమీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఇంతకీ.. షమీని ఆమె ఎందుకు వద్దన్నది? ఈమె ఎందుకు కావాలంటోంది? అని డిస్కస్ చేసుకుంటున్నారు నెటిజన్లు!
షమీ అరుదైన ఘనత, ఆ ఇద్దరు దిగ్గజాల రికార్డ్ బద్దలు
పాయల్ ఘోష్ స్టేట్మెంట్ ఇదీ :షమీ బౌలింగ్ తనకు తెగ నచ్చిందని పాయల్ ఘోష్ చెప్పింది. అంతే కాదు.. "షమీని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అంటూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. అయితే.. ఇందుకు ఓ షరతు కూడా పెట్టింది. షమీ తన ఇంగ్లీష్‌ను మెరుగుపర్చుకుంటే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పడం గమనార్హం. ఆమె పోస్టుపై.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. "ప్రేమకు భాషతో పనేంటి?" అని కొందరు కామెంట్లు చేయగా.. "షమీ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి" అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.
ఎవరీ పాయల్ ఘోష్..? : బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలైన ఈమె మన తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా పరిచయమే. తెలుగులో మంచు మనోజ్ నటించిన ‘ప్రయాణం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన పాయల్.. ఆ తర్వాత పలు సినిమాల్లో కన్పించింది. ఎన్టీఆర్ "ఊసరవెల్లి" సినిమాలో తమన్నాకు స్నేహితురాలి పాత్రలో కూడా కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయిన పాయల్.. 2020లో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం రామ్‌దాస్ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది.
Ind vs Nz World Cup 2023 : గిల్, షమీ అరుదైన రికార్డులు.. తొలి బ్యాటర్‌గా శుభ్‌మన్ ఘనత
షమీ మాజీ భార్య కామెంట్స్ ఇలా: వరల్డ్ కప్‌లో షమీ ప్రదర్శనపై.. మాజీ భార్య హసీన్ జహాన్ కూడా స్పందించారు. ఓ డిబేట్ లో పాల్గొన్న ఆమె షమీ ప్రదర్శన గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. షమీ ఇంకా బాగా ఆడాలని కోరుకుంది. అతను టీమ్ఇండియాలో కొనసాగాలి అంటూ కోరుకుంది. అయితే.. ఆమె వ్యాఖ్యలకు గల కారణాన్ని కూడా తెలిపింది. "షమీ బాగా ఆడితే టీమ్ఇండియాలో కొనసాగుతాడు. ఇంకా బాగా సంపాదిస్తాడు. అతను బాగా సంపాదిస్తే మాకు కూడా సురక్షితంగా ఉంటుంది. షమీ ఇంకా బాగా ఆడాలి" అంటూ జహాన్ ఆకాంక్షించడం గమనార్హం. హసీనా జహాన్వ్యాఖ్యలకు నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అతని కెరీర్ నాశనం అవ్వాలని కోరుకున్న ఆమే.. అతను బాగా ఆడాలని ఆకాంక్షిస్తోందని అంటున్నారు.