ICC World Cup Team India Jersey :రానున్నప్రపంచ కప్ దృష్యా టీమ్ఇండియాకు సంబంధించిన కొత్త జెర్సీనీ విడుదల చేసింది బీసీసీఐ. ఈ క్రమంలో మన ప్లేయర్లు తాజాగా కొత్త జెర్సీలను ధరించి ఓ వీడియోను విడుదల చేశారు.కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అడిడాస్ వచ్చాక భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుకు కూడా మూడు ఫార్మాట్లలో వేర్వేరు జెర్సీలను రూపొందించింది. టీ20ల్లో కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్ జెర్సీ, వన్డేల్లో కాలర్‌తో లైట్ బ్లూ కలర్ జెర్సీ, టెస్ట్‌ల్లో వైట్ కలర్ జెర్సీలను అడిడాస్ రూపొందించింది.
జెర్సీలపై కుడివైపు తమ (అడిడాస్) లోగోను, ఎడమవైపు టీమ్ లోగో, ఆ తర్వాత దానిపై మూడు నక్షత్రాలు, మధ్యలో లీడ్ స్పాన్సర్ డ్రీమ్ 11 పేరు, దాని కింద ఇండియా అని రాసుంది, జెర్సీపై భుజాల భాగంలో మూడు తెలుపు రంగు అడ్డ గీతలు ఉంటాయి. ఇక వరల్డ్‌కప్ నేపథ్యంలో అడిడాస్ కంపెనీ.. కొత్త జెర్సీలో కొన్ని మార్పులు చేసింది. భుజాలపై ఉన్న మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో ఇండియన్ ఫ్లాగ్లోని మూడు రంగులను ప్రింట్ చేసింది. అలాగే టీమ్ లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుగా రూపొందించింది. అయితే ఈ రెండు స్టార్లు.. భారత్ ఇదివరకు గెలిచిన వన్డే (1983, 2011) ప్రపంచకప్‌లకు గుర్తుగా ఉంచారని తెలుస్తోంది.
ఇక టీమిండియా కొత్త జెర్సీని చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జెర్సీతో తీసిన వీడియో అద్భుతమని అంటున్నారు. పాత జెర్సీతో పోలిస్తే, ఇది చాలా కలర్‌ఫుల్‌గా ఉందని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.