ICC World Cup Anthem 2023 :రానున్న ప్రపంచ కప్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా వరల్డ్ కప్ అధికారిక థీమ్ సాంగ్‌ను లాంఛ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తమ అఫీషియల్ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో ఐసీసీ అప్లోడ్ చేసింది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్ వీర్ సింగ్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ కనిపించి ప్రేక్షకులను అలరించారు. 3 నిమిషాల కన్నా ఎక్కువ నిడివి ఉన్న ఈ సాంగ్ ఇప్పుడు క్రికెట్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. 'దిల్ జష్న్ బోలే' అంటూ సాగే ఈ పాట ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇక రణ్‌వీర్ సింగ్, ప్రీతమ్‌తో పాటు క్రికెటర్ యజువేంద్ర చాహల్ సతీమణి ధన శ్రీ వర్మ కూడా ఈ వీడియో సాంగ్‌లో కనిపించి సందడి చేశారు. శ్లోక్ లాల్, సావేరి వర్మ సాహిత్యం అందించగా.. ప్రీతమ్ సంగీతం అందించారు.
ICC World Cup Schedule 2023 :ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం రూపొందించిన సాంగ్‌లో భాగం కావడం నిజంగా గౌరవమని రణ్‌వీర్ సింగ్ అన్నారు. ఇది ఒక వేడుక. మనందరం ఇష్టపడే క్రీడ అని ఆయన వరల్డ్ కప్‌ను కొనియాడారు. ఈ పాట కంపోజ్ చేయడం నాకు గొప్ప గౌరవం అంటూ ప్రీతమ్ వ్యాఖ్యనించారు. ఈ పాట 1.4 బిలియన్ భారతీయ అభిమానులకు మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం భారత్‌కు వచ్చి అతిపెద్ద వేడుకలో భాగం ఆయన కావాలని అన్నారు. మరోవైపుఇంగ్లాండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ప్రపంచ కప్ మెగా సమరం ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న భారత్ మొదటి మ్యాచ్ ఆడనుంది.