తెలంగాణ

telangana

ETV Bharat / sports

ICC World Cup 2023 : క్రికెట్​ లవర్స్​ గెట్​ రెడీ.. వరల్డ్ కప్ టికెట్స్ సేల్స్.. అప్పటి నుంచే స్టార్ట్! - ఐసీసీ ప్రపంచ కప్​ 2023 టిక్కెట్​

ICC World Cup Tickets : భారత్​ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ప్రపంచ కప్​కు సర్వం సిద్ధమౌతున్న వేళ క్రికెట్​ లవర్స్​కు బీసీసీఐ ఓ గుడ్​ న్యూస్​ చెప్పనుంది. త్వరలోనే మ్యాచ్​లకు సంబంధించిన టికెట్లను విక్రయించేందుకు సిద్ధంగా ఉందట. ఆ వివరాలు మీ కోసం..

ICC World Cup 2023 tickets
ఐసీసీ ప్రపంచ కప్​ టికెట్స్

By

Published : Jul 29, 2023, 12:36 PM IST

Updated : Jul 29, 2023, 2:39 PM IST

ICC World Cup Tickets : క్రికెట్​ లవర్స్​ ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రపంచ కప్​ పోటీలకు సర్వం సిద్ధమౌతోంది. ఇప్పటికే ఆయా వేదికల వద్ద భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్న తరుణంలో అభిమానుల కోసం బీసీసీఐ సంస్థ ఓ గుడ్​ న్యూస్​ చెప్పనుంది. త్వరలోనే మ్యాచ్​లకు సంబంధించిన టికెట్లను విక్రయించేందుకు సిద్ధంగా ఉందట. ఈ మేరకు ఆగస్టు 10 నాటికి ఆన్‌లైన్ టికెట్ విక్రయాలను ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ప్రపంచ కప్​ మ్యాచ్​లకు ఆతిథ్యం ఇవ్వనున్న అన్ని అసోసియేషన్ల నుంచి టిక్కెట్ ధరల గురించి సూచనలను కోరిందట. దిల్లీలో రాష్ట్ర సంఘాలతో సమావేశమైన జై షా.. టికెట్​ విక్రయంతో పాటు పలు అంశాల గురించి చర్చించారు. జూలై 31 లోపు తమ ఖరారు చేసిన టికెట్​ ధరలను బోర్డుతో పంచుకోవాలని రాష్ట్ర సంస్థలను ఆయన కోరారు. ఆ తర్వాత మాత్రమే టిక్కెట్లను అమ్మకానికి పెట్టనున్నట్లు తెలిపారు.

ICC World Cup Schedule : అయితే ఇప్పటికే విడుదలైన షెడ్యూల్​లో కొన్ని మార్పులు జరిగే అవకశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయంపై మూడు దేశాల బోర్డులు ఐసీసీకి లేఖలు రాసి షెడ్యూల్‌లో మార్పును అభ్యర్థించాయట. దీనిపై స్పందించిన జై షా వచ్చే మూడు, నాలుగు రోజుల్లోనే ఈ షెడ్యూల్ సమస్యకు ఓ పరిష్కరాన్ని తీసుకొస్తామని ఓ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తేదీలతో పాటు సమయం మాత్రమే మార్చుతామని, వేదికల్లో మార్పులుండవని ఆయన అన్నారు. ఐసీసీని సంప్రదించాకే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తామని జై షా అన్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ రీషెడ్యూల్​పై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

India Vs Pakistan World Cup 2023 : ఇక మ్యాచ్​ల విషయానికి వస్తే.. భారత్‌ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. ఇంగ్లాండ్ - న్యూజిలాండ్​ మ్యాచ్‌తోనే ఈ మెగా సంగ్రామం ప్రారంభం కానుంది. అయితే అటు క్రికెట్​ లవర్స్​తో పాటు ప్రపంచం మెత్తం భారత్ - పాక్‌ మ్యాచ్‌ కోసం ఎదురు చూస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ వేదికగా జరగాల్సి ఉంది. అయితే, మ్యాచ్‌ జరిగే తేదీ మారే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు విపరీతంగా వస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్​కు ఇప్పటి నుంచే ఓ రేంజ్​లో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మ్యాచ్​ జరిగే వారంలో.. అహ్మదాబాద్​ సహా, సమీప నగరాల్లో లగ్జరీ హోటల్స్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కొన్ని హోటల్స్​లో ఒక రోజు బస చేసేందుకు సుమారు రూ. 80 వేల ఖర్చు చేయాల్సి వస్తుందని సమాచారం. పాక్ ప్రపంచ కప్​లో​ తమ మిగతా మ్యాచ్​లను కోల్​కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్​లలో ఆడనుంది.

Last Updated : Jul 29, 2023, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details