తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరల్డ్​ కప్​ 2023 టీమ్​ కెప్టెన్ రోహిత్ శర్మ- ఆ జట్టు​లో ఆరుగురు మనోళ్లే! - ICC World Cup 2023 Team Captain Rohit Sharma

ICC World Cup 2023 Team Captain Rohit Sharma : 2023 వరల్డ్ కప్‌లో ఆడిన ఆటగాళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి- ఐసీసీ అత్యుత్తమ జట్టును ఎంపిక చేసింది. రోహిత్ శర్మను కెప్టెన్​గా ప్రకటించింది. అందులో ఆరుగురు భారత ఆటగాళ్లకు స్థానం దక్కడం గమనార్హం.

ICC World Cup 2023 Team Captain Rohit Sharma
ICC World Cup 2023 Team Captain Rohit Sharma

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 8:51 PM IST

ICC World Cup 2023 Team Captain Rohit Sharma :క్రికెట్​లో అతిపెద్ద టోర్నమెంట్ ముగిసింది. ఆస్ట్రేలియా ఫైనల్​లో భారత్​ను ఓడించి.. 2023 వరల్డ్​కప్ విజేతగా నిలిచింది. అయితే స్వదేశంలో జరుగిన ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా ఫైనల్​కు చేరుకోవడం.. ఫ్యాన్స్​లో మరింత ఉత్సాహం నింపింది. అయితే సోమవారం ఐసీసీ కీలక ప్రకటన చేసింది. టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్​ను ఎంపిక చేసింది. మొత్తం 11 మంది ప్లేయర్లతో కూడిన జట్టులో వరల్డ్ కప్‌లో ఆడిన మెరికలను ఇందులోకి తీసుకుంది. ఇక ఈ జట్టుకు సారథిగా రోహిత్ శర్మను సెలెక్ట్ చేసింది ఐసీసీ. ప్రపంచ కప్ ఫైనల్​లో జట్టును గెలిపించడంలో విఫలమైనా.. అతడి ప్రతిభను తక్కువగా అంచనా వేయలేమని పేర్కొంది. కెప్టెన్‌, ఓపెనర్‌గా రోహిత్ శర్మ సమర్థవంతంగా రాణించాడని కొనియాడింది.

ఐసీసీ 'టీమ్‌ ఆఫ్ ది టోర్నమెంట్' ఇదే..

  • క్వింటన్‌ డికాక్‌ (దక్షిణాఫ్రికా) -10 మ్యాచుల్లో 594 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలు ఉన్నాయి.
  • రోహిత్ శర్మ (భారత్) -11 మ్యాచుల్లో 597 పరుగులు చేశాడు. ఒక సెంచరీ ఉంది.
  • విరాట్ కోహ్లీ (భారత్) - టోర్నీలోనే టాప్ స్కోరర్. 11 మ్యాచుల్లో 765 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.
  • డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) - కివీస్‌ టాప్‌ ఆర్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ 10 మ్యాచుల్లో 552 పరుగులు సాధించాడు. రెండు సెంచరీలు నమోదు చేశాడు.
  • కేఎల్ రాహుల్ (భారత్) - భారత మిడిలార్డర్‌లో కీలక ఆటగాడు. 11 మ్యాచుల్లో 452 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది.
  • గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) - డబుల్ సెంచరీ చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ 9 మ్యాచుల్లో 400 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ ఆరు వికెట్లు పడగొట్టాడు.
  • రవీంద్ర జడేజా (భారత్) - స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ టోర్నీలో 20 వికెట్లు తీశాడు.
  • దిల్షాన్‌ మదుషంక (శ్రీలంక) - సంచలన యువ బౌలర్‌ టోర్నీలో అదరగొట్టాడు. కేవలం 9 మ్యాచుల్లోనే 21 వికెట్లు పడగొట్టాడు. భారత్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
  • ఆడమ్‌ జంపా (ఆస్ట్రేలియా) - ఈ ఆసీస్‌ స్పిన్నర్‌ 11 మ్యాచుల్లో 23 వికెట్లు తీశాడు. మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌.
  • జస్‌ప్రీత్‌ బుమ్రా (భారత్)- భారత స్టార్‌ పేసర్ బుమ్రా ఈ వరల్డ్ కప్‌లో 20 వికెట్లు పడగొట్టాడు.
  • మహమ్మద్ షమీ (భారత్)- సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కకావికలం చేశాడు. టాప్‌ వికెట్‌ టేకర్‌ కూడా షమీనే. కేవలం 7 మ్యాచుల్లోనే 24 వికెట్లు తీశాడు.
  • గెరాల్డ్ కొయిట్జీ (దక్షిణాఫ్రికా)- ఇతడిని ఐసీసీ 12వ ఆటగాడిగా ఎంపిక చేసుకుంది. దక్షిణాఫ్రికా పేసర్ కొయిట్జీ 8 మ్యాచుల్లో 20 వికెట్లు తీశాడు.

ABOUT THE AUTHOR

...view details