ICC World Cup 2023 Schedule : భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మకఐసీసీ వన్డే ప్రపంచకప్‌షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. 46 రోజుల పాటు ఈ టోర్నీలో మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మొత్తం 10 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఇప్పటికే 8 జట్లు నేరుగా టోర్నీకి అర్హత సాధించాయి. మరో రెండు జట్లు జింబాబ్వేలో జరిగే క్వాలిఫయర్ టోర్నమెంట్ ద్వారా ప్రపంచకప్‌నకు అర్హత సాధించనున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మిగిలిన తొమ్మిది జట్లతో రౌండ్ బిన్ పద్ధతిలో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో సెమీఫైనల్స్‌కు పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు అర్హత సాధిస్తాయి.
Icc world Cup Schedule : అక్టోబర్ 8న అస్ట్రేలియాతో భారత్.. చెన్నై వేదికగా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న భారత్-పాక్‌తో తలపడనుంది. మరోవైపు లీగ్ దశలో టీమ్‌ఇండియా మొత్తం 8 మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్ 15, 16న ముంబయి, కోల్‌కతా వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగ్గా.. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. హైదరాబాద్ వేదికగా 3 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.