తెలంగాణ

telangana

ETV Bharat / sports

ICC World Cup 2023 Qualifiers : విండీస్​పై నెదర్లాండ్స్​ 'సూపర్​ విక్టరీ'.. మెరిసిన తెలుగు తేజం.. - విండీస్​ వర్సెస్​ నెదర్లాండ్స్ హైలైట్స్​

ICC World Cup 2023 Qualifiers : జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్​ కప్ 2023 క్వాలిఫయర్​ మ్యాచ్​లో వెస్టిండీస్​పై నెదర్లాండ్స్ జట్టు​ సూపర్​ విక్టరీ సాధించింది. ఈ పోరులో మన తెలుగు తేజం సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్​ను అందించగా.. మరో ఆటగాడు వాన్​ బీక్​ సూపర్​ ఓవర్​లో కొట్టిన షాట్​లతో సూపర్​ సిక్స్​ జట్ల లిస్ట్​లో విండీస్​ ఆశలను గల్లంతు చేసింది.

ICC Men's Cricket World Cup Qualifiers
సూపర్​ ఓవర్​తో విండీస్​పై నెదర్లాండ్స్​ 'సూపర్​ విక్టరీ'.. చెలరేగిన వాన్​ బీక్​.. మెరిసిన తెలుగు తేజం..

By

Published : Jun 27, 2023, 11:21 AM IST

Updated : Jun 27, 2023, 11:41 AM IST

ICC Men's Cricket World Cup 2023 Qualifier : భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్​కు ముందే వెస్టిండీస్‌‌ జట్టుకు నెదర్లాండ్స్ గట్టి షాకిచ్చింది. జింబాబ్వే గడ్డపై జరుగుతున్న ఐసీసీ ప్రపంచ​ కప్ 2023 క్వాలిఫయర్​ మ్యాచ్​లో బలమైన జట్టు విండీస్​తో జరిగిన పోరులో నెదర్లాండ్స్​ ఆటగాళ్లు దూకుడును ప్రదర్శించి కరేబియన్​లకు చుక్కలు చూపించారు. విండీస్​ టీమ్​ భారీ స్కోరు చేసినప్పటికీ.. ఆఖరి వరకూ పోరాడి నిలిచి నెదర్లాండ్స్.. మ్యాచ్​ను డ్రాగా మార్చింది ​. దీంతో సూపర్​ ఓవర్​లో చెలరేగిన డచ్​ ఆటగాడు వాన్​ బీక్​ ఆ జట్టుకు సూపర్​ డూపర్​ విక్టరీని అందించాడు. అయితే నెదర్లాండ్స్​ జట్టులో ఆడుతున్న మన ఆంధ్ర కుర్రాడు తేజ నిడమనూరు.. విండీస్​తో జరిగిన మ్యాచ్​లో మేటి ఇన్నింగ్స్​ను ఆడి టీమ్​ గెలిచేందుకు సహాయపడ్డాడు. ఈ అనూహ్య విజయంతో నెదర్లాండ్స్​ సూపర్​ సిక్స్​ జట్టుల జాబితాలో చోటు దక్కించుకుంది.

భారీ టార్గెట్​తో బరిలోకి దిగినప్పటికీ ఎక్కడా తడబడలేదు నెదర్లాండ్స్​ ఆటగాళ్లు. అయితే ఈ మ్యాచ్​లో ఆంధ్రప్రదేశ్​ విజయవాడకు చెందిన తేజ నిడమనూరు బ్యాటింగ్​లో తన దూకుడును ప్రదర్శించి జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. 76 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్​లతో 111 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్​ ఆడాడు. ఇతడికి తోడుగా నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (47 బంతుల్లో 67, 6 ఫోర్లు, 1 సిక్స్​) కూడా విజృంభించాడు.

విండీస్​ విధ్వంసం..
West Indies ICC : ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకున్న నెదర్లాండ్స్​.. బౌలింగ్​లో పెద్దగా అనుభవం లేకున్నా విండీస్​ ఆటగాళ్ల ఆటకట్టించింది. ఓపెనర్లుగా వచ్చిన బ్రాండన్​ కింగ్ (76), చార్లెస్ (54) ద్వయం తొలి వికెట్​కు 101 పరుగులు జోడించి అద్భుత ఇన్నింగ్స్​ ఆడారు. ఇక చివర్లో కీమో పాల్ కూడా 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో రెచ్చిపోవడంతో కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 374 పరుగులు చేసింది.

నెదర్లాండ్స్​ ఇన్నింగ్స్​..
West Indies vs Netherlands : డచ్​ టీమ్​ ఓపెనర్​ విక్రమ్‌జీత్ సింగ్.. 32 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 37 పరుగులు చేశాడు. మరో ఓపెనర్​ ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (36) కూడా రాణించాడు. వీరికి తోడు ఆట చివర్లో వచ్చిన బ్యాటర్​ లొగన్​ వాన్​ బీక్​ 14 బాల్స్​లోనే 3 ఫోర్లు, ఒక సిక్సర్​ బాది 28 రన్స్​ చేశాడు. విండీస్​ నిర్దేశించిన లక్ష్యానికి వీరికి 9 పరుగుల అవసరం కాగా 8 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్​ డ్రాగా మారింది. దీంతో సూపర్​ ఓవర్​ ద్వారా ఊహించని విజయాన్ని అందుకుంది నెదర్లాండ్స్​.

గట్టెకించిన సూపర్ ఓవర్​..
West Indies vs Netherlands super over : ఈ సూపర్​ ఓవర్​లో తొలుత నెదర్లాండ్స్​ బ్యాటింగ్ చేసింది. అయితే మంచి జోరు మీదున్న వాన్ బీకే బ్యాటింగ్​కు దిగాడు. జేసన్ హోల్డర్ వేసిన సూపర్​ ఓవర్​లో 4,6,4,6,6,4 షాట్​లతో ఏకంగా 30 పరుగులు పట్టేశాడు. ఆ తర్వాత అతడి బౌలింగ్​లోనే విండీస్​ను 8 పరుగులకే చేతులెత్తేసింది. ఈ ఓవర్​లో కరేబియన్​లను దెబ్బతీయడమే కాకుండా రెండు వికెట్లు పడగొట్టాడు వాన్​. ఇది అతడి కెరీర్​లో మరిచిపోలేని చిరస్మరణీయ ఇన్నింగ్స్​ కావడం విశేషం. ఇక ఈ ఓటమితో విండీస్ ప్రపంచ కప్​ క్వాలిఫైయింగ్​ ఆశలు దాదాపు అనుమానమే. ఆ జట్టు సూపర్ సిక్సెస్​ లిస్ట్​లో చేరినా టాప్-2లో నిలవడం మాత్రం కాస్త కష్టమే.

Last Updated : Jun 27, 2023, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details