తెలంగాణ

telangana

ETV Bharat / sports

ICC World Cup 2023 : భారత్- పాక్ మ్యాచ్ హైప్​ పీక్స్.. ఆస్పత్రులనూ వదలట్లేదుగా! - భారత్ వర్సెస్ పాకిస్థాన్ 2023

ICC World Cup 2023 : భారత్ - పాకిస్థాన్​ ప్రపంచకప్​ మ్యాచ్​ను ప్రత్యక్షంగా చూసేందుకు ఇప్పటి నుంచే ఫ్యాన్స్ వివిధ ప్లాన్స్ వేసుకుంటున్నారు. మ్యాచ్ రోజున దాదాపు అక్కడి హోటళ్లన్నీ ఫుల్ అవ్వడం వల్ల.. క్రికెట్ ఫ్యాన్స్ వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అసలేమైందంటే?

ICC World Cup 2023
మ్యాచ్ కోసం ఆసుపత్రిలో బస

By

Published : Jul 21, 2023, 4:05 PM IST

ICC World Cup 2023 : 2023 ప్రపంచకప్​లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్​పై ఇప్పటికే అంచనాలు పీక్​ స్టేజ్​లో ఉన్నాయి. మెగా టోర్నీలో దాయాదుల మ్యాచ్​ను లైవ్​లో వీక్షించేందుకు ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. కాగా మ్యాచ్​ జరిగే ముందు రోజు అక్కడి​ హోటళ్లకు తెగ డిమాండ్ ఏర్పడింది. ఈ సందర్భంగా అనేక మంది క్రికెట్ అభిమానులు.. ఇప్పటి నుంచే బస చేసేందుకు హోటళ్లలో గదులు బుక్ చేసుకుంటున్నారు.

అయితే మ్యాచ్​కు ఉన్న ఇంపార్టెన్స్​ను దృష్టిలో ఉంచుకున్న నిర్వాహకులు.. రూమ్స్​ ధరలను అమాంతం పెంచేశారు. ఆయా హాటళ్లలో ఒక్క రోజు బస చేసేదుకు అభిమానులు గరిష్ఠంగా రూ. లక్ష వరకూ చెల్లించాల్సి వస్తుంది. అయినప్పటికీ మ్యాచ్​ నేపథ్యంలో ఇప్పటికే చాలా హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్​లతో ఫుల్​ అయినట్లు తెలుస్తోంది.

మ్యాచ్​ కారణంగా అహ్మదాబాద్ నగర పరిసరాల్లో ధరల వేడిని తట్టుకోలేని ఫ్యాన్స్ కొత్త ప్లాన్​ వేశారు. ఎలాగైనా మ్యాచ్​ చూడాలన్న ఉద్దేశంతో.. వినూత్నంగా ఆలోచించారు. బస చేసేందుకు నరేంద్ర మోదీ స్టేడియం ప్రాంతంలో ఉన్న ఆస్పత్రులలో బెడ్స్​పై కన్నేశారు. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరికినా చాలనుకుంటున్నారు కొందరు క్రికెట్ అభిమానులు. మ్యాచ్​ సందర్భంగా ఆస్పత్రుల్లో బస చేసేందుకు అనేక మంది నుంచి విజ్ఞప్తులు వస్తున్నాంటూ.. ఆయా యాజమాన్యాలు తెలిపాయి.

అనేక మంది హోటళ్లు దొరక్క.. హాస్పిటల్స్​లో బస చేసేందుకు మొగ్గు చూపుతున్న తరుణంలో ఆస్పత్రుల మేనేజ్​మెంట్​లు బెడ్స్​ రేట్లను కూడా అమాంతం పెంచేస్తున్నాయి. ఆయా ఆస్పత్రిలో ఒక రోజు బస చేసేందుకు రూ. 2 వేల నుంచి రూ. 25 వేల వరకు వసూల్ చేయనున్నట్లు తెలుస్తోంది. పైగా ఇక్కడ వసతి కల్పించడమే కాకుండా.. ఆహారం ఇచ్చి ఉచితంగా పూర్తి హెల్త్ చెకప్​ చేస్తామంటూ ఆస్పత్రులు ప్రచారం చేస్తున్నాయి. కాగా ఇక్కడ రోగితో పాటు ఇంకొకరు కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో మెజార్టీ ఫాన్స్ ఈ ఐడియాకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
కాగా అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ సంబరం మొదలుకానుంది. ఈ టోర్నమెంట్​లో భారత్.. పాకిస్థాన్​తో అక్టోబరు 15న తలపడనుంది.

ABOUT THE AUTHOR

...view details