తెలంగాణ

telangana

ETV Bharat / sports

ICC Women world cup 2022: భారత జట్టు ఇదే.. పాక్​తో తొలి పోరు - ఐసీసీ మహిళల ప్రపంచకప్​ జట్టు

ICC Women world cup 2022: ఈ ఏడాది మార్చిలో జరగబోయే ఐసీసీ మహిళల ప్రపంచకప్​ 2022 కోసం జట్టును ప్రకటించారు. మిథాలీ రాజ్​ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన టీమ్​ అక్కడికి వెళ్లనుంది.

ICC Women's World Cup 2022 teamindia squad
ICC Women's World Cup

By

Published : Jan 6, 2022, 11:13 AM IST

Updated : Jan 6, 2022, 11:43 AM IST

ICC Women world cup 2022: న్యూజిలాండ్​లో ఈ మార్చిలో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్​ కోసం భారత మహిళల క్రికెట్​ జట్టును ప్రకటించారు. మిథాలీ రాజ్​ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన టీమ్​ను ఖరారు చేసింది. ప్రపంచకప్​కు ముందు భారత జట్టు ఫిబ్రవరి 11 నుంచి న్యూజిలాండ్​తో ఐదు మ్యాచుల వన్డే సిరీస్​ కూడా ఆడనుంది. ఈ సిరీస్​లో కూడా ఇదే జట్టు తలపడనుంది.

మార్చి 4న ప్రారంభంకానున్న ఈ మెగాటోర్నీలో టీమ్​ఇండియా తన తొలి మ్యాచ్​ను మార్చి 6న ఓవల్​ వేదికగా పాకిస్థాన్​తో తలపడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్​(మార్చి 10), వెస్టిండీస్​(మార్చి 12), ఇంగ్లాండ్​(మార్చి 16), ఆస్ట్రేలియా(మార్చి 19), బంగ్లాదేశ్​(మార్చి 22), దక్షిణాఫ్రికాతో(మార్చి 27) గ్రూప్​ స్టేజ్​లో ఆడనుంది. కాగా, ఈ టోర్నీకి కీలక ప్లేయర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ను ఎంపిక చేయకపోవడం గమనార్హం.

జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్​కీపర్​), స్నేహ్​ రాణా, జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్ , తానియా భాటియా (వికెట్​కీపర్​), రాజేశ్వరి గైక్వాడ్​, పూనమ్ యాదవ్.

స్టాండ్​ బై ప్లేయర్స్​: సబ్బినేని మేఘన, ఏక్తా బిష్త్​, సిమ్రాన్​ దిల్​ బహదూర్​.

న్యూజిలాండ్​తో ఫిబ్రవరి 9న జరిగే టీ20 కోసం మరో జట్టును ప్రకటించారు.

జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్​కీపర్​), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుక సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్​కీపర్​), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, ఎస్. మేఘన, సిమ్రాన్ దిల్ బహదూర్.

ఇదీ చూడండి:ఈ స్విమ్మర్​ ఈదితే రికార్డ్​.. ఇక నవ్విందంటే..

Last Updated : Jan 6, 2022, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details