తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్మృతి మంధాన, దీప్తి శర్మ జోరు.. కెరీర్​లో అత్యుత్తమ ర్యాంక్​ - స్మృతి మంధాన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్

ICC Womens T20 Ranking : ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్​లో భారత మహిళా ప్లేయర్లు సత్తా చాటారు. ఓపెనర్ స్మృతి మంధాన, ఆల్​ రౌండర్ దీప్తి శర్మ​ కెరీర్ అత్యుత్తమ ర్యాంకులను అందుకున్నారు.

icc womens t20 ranking
icc womens t20 ranking

By

Published : Oct 18, 2022, 5:52 PM IST

Updated : Oct 18, 2022, 6:16 PM IST

ICC Womens T20 Ranking: ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్​లో టీమ్ ఇండియా ప్లేయర్లు అదరగొట్టారు. భారత ఓపెనర్​ స్మృతి మంధాన(730 పాయింట్లు), బౌలర్​ దీప్తి శర్మ(742 పాయింట్లు).. తమ కెరీర్​లో అత్యుత్తమ ర్యాంక్​లను సొంతం చేసుకున్నారు. వీరిద్దరు తమ బ్యాటింగ్, బౌలింగ్​ విభాగాల్లో రెండో స్థానానికి చేరుకున్నారు.

మహిళల ఆసియా కప్​లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో భారత్​ ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్​లో మంధాన 25 బంతుల్లో 51 పరుగులతో మెరిసింది. ఈ అద్భుత ప్రదర్శనతోనే ఆమె ర్యాంకింగ్స్​లో తాజా ఘనత సాధించింది. ఇక దీప్తి.. ఆసియా కప్​ ఫైనల్​లో నాలుగు ఓవర్లలో కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చింది. అలాగే థాయ్​లాండ్​తో జరిగిన సెమీస్​లోనూ ఏడు ఓవర్లలో మూడు వికెట్లు తీసింది. ఆసియా కప్​లో మొత్తంగా 13 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్​గా నిలిచింది. దీంతో 742 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్​కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ కంటే 14 పాయింట్లు వెనకబడి ర్యాంకింగ్స్​లో రెండో స్థానంలో నిలిచింది. అలానే ఆల్​ రౌండర్ ర్యాంకింగ్స్​లోనూ మూడో స్థానంలో నిలిచింది. ఇక ఆల్​రౌండ్​ విభాగంలో తొలి స్థానంలో వెస్ట్​ ఇండీస్​కు చెందిన హేలీ మ్యాథ్యూస్​(377), రెండో స్థానంలో న్యూజిలాండ్​కు చెందిన సోఫీ డివైన్(390) నిలిచారు.

ఇక ఫాస్ట్ బౌలర్ రేణుక సింగ్ 5 స్థానాలు మెరుగుపరుచుకుని కెరీర్​ బెస్ట్​ మూడో స్థానానికి చేరుకుంది. అలాగే స్నేహ్​ రానా కూడా కెరీర్​ బెస్ట్​ పదో ర్యాంకుకు చేరుకుంది.

ఇవీ చదవండి:బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. ఎన్నిక ఏకగ్రీవం

ఐసీసీ ఛైర్మన్​ రేసులో ఎవరు?.. గంగూలీకి కష్టమేనా?

Last Updated : Oct 18, 2022, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details