ICC Trophy Winners History :ఐసీసీ ట్రోఫీ గెలవాలని ఏ క్రికెట్ టీమ్‌కు మాత్రం ఉండదు చెప్పండి. దాదాపుగా అన్ని జట్లూ ఈ ఘనతను అందుకున్నాయి. కానీ.. అది జరిగి ఏళ్లు అవుతుంది. ఈ నెలలో ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఏయే క్రికెట్ జట్టు ట్రోఫీని చివరి సారిగా గెలిచింది అనే అంశాల గురించి ఓ లుక్కేద్దాం.
1. సౌత్ ఆఫ్రికా (1998 నుంచి)
సౌత్ ఆఫ్రికా క్రికెట్‌ను తొలిసారి 1889లో ఆడింది. అప్పటికీ ఈ క్రీడ ఆడుతున్న మూడో దేశంగా ఉంది. ఈ జట్టు ఎంతో మంది లెజెండ్లను క్రికెట్‌కు అందించింది. ఈ టీమ్‌లో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వీళ్ల ఖాతాలో పెద్దగా ఐసీసీ ట్రోఫీలు లేవు. చివరి సారిగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుందీ దేశం. అదే ఆ జట్టు మొదటి, చివరి కప్పు కావడం విశేషం. ఆ సమయంలో జట్టును హాన్సీ క్రాంజీ కెప్టెన్ గా ఉన్నాడు. తర్వాతి కాలంలో ఎన్నో గేమ్స్, టోర్నీలు ఆడింది కానీ.. ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది.
2. ఇండియా (2013 నుంచి)
India 2011 World Cup Win : టీమ్ఇండియా ఖాతాలో ఇప్పటిదాకా 5 ఐసీసీ ట్రోఫీలున్నాయి. మొదటిసారిగా కపిల్ దేవ్ నాయక్వతంలో 1983 వన్డే ప్రపంచ కప్ గెలుచుకుంది. తర్వాత దాదా సౌరభ్ గంగూలీ హయాంలో 2002 ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో వరుసగా 2007 టీ 20, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలు గెలుచుకుని మొత్తం మీద తన ఖాతాలో 5 కప్‌లు వేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా టీమ్ఇండియాకు ఐసీసీ ట్రోఫీ గెలవడం తీరని కోరికగానే మిలిగిపోయింది. 2019 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ వరకు వచ్చినా.. విఫలమైంది. మరి ఈ సారైనా ఆ కోరిక తీరుతుందో లేదో చూడాలి.
3. శ్రీలంక (2014 నుంచి)
శ్రీలంక చివరి సారిగా ఐసీసీ ట్రోఫీ గెలిచి 12 ఏళ్లవుతోంది. 2014 ఇండియాపై గెలిచిన టీ20 వరల్డ్ కప్.. లంకకు చివరిది. అది ఆ జట్టుకు మొదటి టీ 20 వరల్డ్ కప్ కాగా.. ఓవరాల్ గా మూడో ఐసీసీ ట్రోఫీ. శ్రీలంక మొదటి సారి అర్జున రణతుంగ కెప్టెన్సీలో 1996 వన్డే ప్రపంచ కప్ గెలుచుకుంది. తర్వాత 2002లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాతో కలిసి కప్పును పంచుకుంది. ఆ సమయంలో వర్షం అడ్డంకి వల్ల ఇరు జట్లను విజేతలుగా ప్రకటించారు.
4. వెస్టిండీస్ (2016 నుంచి)
వెస్టిండీస్ ఇప్పటి వరకు 5 సార్లు ఐసీసీ ట్రోఫీలను ముద్దాడింది. క్రికెట్ చరిత్రలో 1975, 1979 లో నిర్వహించిన మొదటి, రెండు వరల్డ్ కప్పులను వెస్టిండీస్ జట్టు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. తర్వాత 2004 ఛాంపియన్స ట్రోఫీ, 2012లో టీ 20 ప్రపంచ కప్, 2016 లో రెండోసారి పొట్టి కప్పును సొంతం చేసుకుంది. అదే ఆ జట్టుకు చివరి ఐసీసీ కప్పు కావడం విశేషం. కానీ.. బాహుబలి లాంటి దేహాలు కలిగిన ఆటగాళ్లున్న కరీబియన్ టీమ్.. ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్పునకు క్వాలిఫై కాకపోవడం యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది.