తెలంగాణ

telangana

ETV Bharat / sports

బిగ్​షాక్​.. ఐసీసీ కీలక నిర్ణయం.. ఇంగ్లాండ్‌లో వరల్డ్​కప్​! - టీ20 ప్రపంచకప్‌ 2024 అమెరికా

T20 World Cup 2024 Venue : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌- 2024 వేదిక మారే సూచనలు కన్పిస్తున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది జూన్​లో వెస్టిండీస్‌, అమెరికా వేదికగా ఈ మెగా ఈవెంట్‌ జరగాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఐసీసీ.. వేదికను ఇంగ్లాండ్​కు మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.

t20 worldcup 2024
t20 worldcup 2024

By

Published : Jun 5, 2023, 6:51 PM IST

T20 World Cup 2024 Venue : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2024 వేదిక మారే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే అక్కడ క్రికెట్ మైదానాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐసీసీ ప్రమాణాలకు తగ్గట్లు లేదని తెలుస్తోంది. అందుకే టీ20 వరల్డ్​ కప్​ వేదికను మార్చనున్నట్లు సమచారం.

అయితే ఐసీసీ.. టీ20 వరల్డ్ కప్ వేదికను ఇంగ్లండ్‌కు మార్చాలని ఐసీసీ భావిస్తోందట. ఎందుకంటే ఈ వరల్డ్ కప్‌ మరో 12 నెలల్లోనే ఉంది. ఆలోపు అమెరికాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్చడం అంత సులభం కాదు! అందుకే ఈ టోర్నీని నిర్వహించాలని ఇంగ్లండ్‌ను రిక్వెస్ట్ చేయాలని ఐసీసీ అనుకుంటోందట. గతంలో ఐసీసీ ప్రకటన ప్రకారం 2030 టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్​లో జరగాల్సి ఉంది.

T20 World Cup 2024 ICC : ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా వచ్చే వరల్డ్ కప్‌ను ఇంగ్లాండ్‌లో నిర్వహించి.. 2030లో టోర్నీని అమెరికాలో ఏర్పాటు చేయాలని ఐసీసీ ప్లాన్ చేస్తోందట. ఇలా చేయడం వల్ల ఐసీసీ ఈవెంట్ నిర్వహించే స్థాయికి యూఎస్ఏ స్టేడియాల్లో వసతులు అందుబాటులోకి వస్తాయని భావిస్తోందట. 'యూఎస్ఏలో వసతులు బాగాలేవు. అందుకే 2024, 2030 వేదికలను స్వాప్ చేయాలని ఐసీసీ అనుకుంటోంది. లేదంటే మరీ ఇంత తొందరగా వసతులు ఏర్పాటు చేయడం జరగదు' అని ఓ ఐసీసీ అధికారి తెలిపారు.

ప్రస్తుతం అమెరికాలో కేవలం రెండు స్టేడియాల్లో మాత్రమే అంతర్జాతీయ స్థాయి వసతులు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్ ఒకటి కాగా.. టెక్సాస్‌లోని మూసా స్టేడియం రెండోది. ఇప్పటి వరకు అసోసియేట్ దేశాలు ఆడిన 12 వన్డేలకు మూసా స్టేడియం వేదికగా నిలిచింది. ఇక సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్‌లో ఇండియా, వెస్టిండీస్, న్యూజిల్యాండ్, శ్రీలంక తదితర దేశాలు పాల్గొన్న 14 టీ20లకు ఆతిథ్యం ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ కోసం మరిన్ని స్టేడియాలను అభివృద్ధి చేయాల్సి ఉంది.

భారత్​లో వన్డే వరల్డ్​ కప్​..
ODI World Cup 2023 : మరోవైపు, ఐసీసీ వన్డే వరల్డ్​ కప్​కు భారత్​ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో మెగా టోర్నీ జరగనుంది. టోర్నమెంట్​లో భాగంగా ప్రతి జట్టూ లీగ్‌ దశలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రపంచకప్‌ ఆతిథ్యం కోసం బెంగళూరు, చెన్నై, దిల్లీ, ధర్మశాల, గువాహటి, హైదరాబాద్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ఇందౌర్‌, రాజ్‌కోట్‌, ముంబయి, అహ్మదాబాద్‌ వేదికల్ని బీసీసీఐ ఎంపిక చేసింది. 46 రోజుల పాటు సాగే ప్రపంచకప్‌లో 48 మ్యాచ్‌లు జరుగుతాయి. 2011లో భారత్‌ చివరిసారిగా ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వగా.. ధోని సారథ్యంలోని టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details