ICC Test Rankings: ఐసీసీ కొత్త టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో టీమ్ ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి.. ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో 79, 29 పరుగులతో రాణించడం వల్ల విరాట్ ర్యాంకు మెరుగుపడింది.
అదే టెస్టులో సెంచరీతో రాణించిన రిషభ్ పంత్ 10 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకుకు చేరుకోగా.. రోహిత్ శర్మ ఓ స్థానం దిగజారి ఆరుకు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ కెరీర్లోనే అత్యుత్తుమ ర్యాంకును అందుకున్నాడు. ఐదో స్థానంలో నిలిచాడు.