తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టు ర్యాంకింగ్స్.. మూడో స్థానానికి పడిపోయిన భారత్ - ఐసీసీ ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో భారత్​ మూడో స్థానంలోకి పడిపోయింది. ఇంగ్లాండ్​పై యాషెస్​ సిరీస్​ నెగ్గిన ఆస్ట్రేలియా మొదటి స్థానానికి ఎగబాకింది.

team India
భారత జట్టు

By

Published : Jan 20, 2022, 12:09 PM IST

Updated : Jan 20, 2022, 12:23 PM IST

ICC Test Rankings: ఐసీసీ టెస్టు జట్ల​ ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఈ జాబితాలో.. యాషెస్​ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​పై ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 119 రేటింగ్ పాయింట్స్​తో మొదటి స్థానం దక్కించుకుంది.

ఆస్ట్రేలియా జట్టు

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా 2-1 తేడాతో టెస్టు సిరీస్​ కోల్పోయిన టీమ్​ఇండియా.. ర్యాంకింగ్స్​లో మూడో స్థానానికి పడిపోయింది. గతేడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్.. ప్రస్తుతం 117 రేటింగ్ పాయింట్స్​తో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

భారత్​పై విజయం అనంతరం దక్షిణాఫ్రికా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఐదో స్థానానికి ఎగబాకింది. దీంతో పాకిస్థాన్​ ఆరో స్థానానికి పడిపోయింది. శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నాయి.

ఇదీ చదవండి:

ICC Test Rankings: కోహ్లీ కాస్త పైకి.. పంత్, బుమ్రా దూకుడు

Last Updated : Jan 20, 2022, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details