తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియాకు షాక్​.. టెస్టుల్లో నెం. 1గా టీమ్​ఇండియా - wtc final 2023

టెస్టుల్లో.. ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి టీమ్​ఇండియా నంబర్​ వన్​ స్థానానికి ఎగబాకింది. తాజాగా ఐసీసీ (ఇంటర్​నేషనల్ క్రికెట్​ కౌన్సిల్​) విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో భారత జట్టు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

icc test ranking 2023
icc test ranking 2023

By

Published : May 2, 2023, 3:32 PM IST

Updated : May 2, 2023, 5:55 PM IST

టీమ్​ఇండియా మరో ఘనత సాధించింది. ఆస్ట్రేలియా జట్టును వెనక్కి నెట్టి టెస్టుల్లో నంబర్​ వన్​గా నిలిచింది. ఈ మేరకు ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్ అప్‌డేట్ చేసి మంగళవారం విడుదల చేసింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​షిప్ (డబ్ల్యూటీసీ)​ ఫైనల్​ జరగనున్న నేపథ్యంలో.. టీమ్​ఇండియా ప్రథమ స్థానంలో నిలవడం వల్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఆస్ట్రేలియా-టీమ్​ఇండియా జట్లు జూన్​ 7 నుంచి యూకే కెన్నింగ్​టన్​లోని ఓవల్​ స్టేడియం వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ​ ఫైనల్​​లో తలపడనున్నాయి. ​కాగా, వన్డే ర్యాంకింగ్స్​ను.. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్​, న్యూజిలాండ్​ సిరీస్​ అయిపోయాక మే 10న ఐసీసీ ప్రకటించనుంది.

ఇటీవల ముగిసిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది టీమ్​ఇండియా. దీంతో ఇన్నాళ్లూ 122 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగిన ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి 121 రేటింగ్​ పాయింట్లతో మొదటి స్థానానికి ఎగబాకింది. అయితే, ఇటీవల పాకిస్థాన్​తో జరిగిన సిరీస్​లో ఆస్ట్రేలియా గెలిచినా.. ఆసీస్​ రేటింగ్​ 116కు దిగజారి ప్రస్తుతం రెండో ప్లేస్​లో కొనసాగుతోంది. ఇక మూడో స్థానంలో ఇంగ్లాండ్,​నాలుగు, ఐదు స్థానాల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్​ ఉన్నాయి. కాగా, టాప్ రెండు స్థానాల్లో తప్ప మిగతా ర్యాంకుల్లో ఎలాంటి మార్పుల్లేవు.

యాషెస్ సిరీస్ 2021-22లో ఇంగ్లండ్​ను 4-0తో చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. టీమ్​ఇండియాను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్​ దక్కించుకుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. మొదటి స్థానాన్ని కోల్పోయింది. మొత్తానికి 15 నెలల తర్వాత టీమ్​ఇండియా మరోసారి తన స్థానాన్ని ఆసీస్​ నుంచి వెనక్కి తీసుకుంది.

ఇప్పటివరకు, 15 నెలలుగా టెస్టుల్లో కంగారూ జట్టు అగ్ర స్థానంలో కొనసాగింది. "వార్షిక టెస్టు ర్యాంకింగ్స్​లో భాగంగా మే 2020 నుంచి జరిగిన సిరీస్ లను పరిగణనలోకి తీసుకుంటాం. మే 2022కు ముందు జరిగిన సిరీస్​లకు 50 % వెయిటేజీ, ఆ తర్వాత జరిగిన సిరీస్​లకు 100 % వెయిటేజీ ఉంటుంది" అని ఐసీసీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

ర్యాంకింగ్స్​లో టాప్​ రెండు జట్ల మధ్య జూన్​ 7న జరగబోయే వరల్డ్​ టెస్ట్​ కోసం అభిమానులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా టోర్నీకి బీసీసీఐ భారత జట్టును ఇటీవలే ప్రకటించింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. అయితే, ఇందులో మిస్టర్‌ 360గా పేరుగాంచిన సూర్యకుమార్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకోలేదు. మరోవైపు, ఈ ఐపీఎల్‌ సీజన్​లో చెన్నై తరఫున అదరగొడుతున్న రహానేను జట్టులోకి తీసుకుంది. తెలుగు కుర్రాడు కేఎస్‌ భరత్‌ను వికెట్‌ కీపర్‌గా జట్టులోకి తీసుకుంది.

Last Updated : May 2, 2023, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details