ICC Team of 2021: ఐసీసీ 2021 ఏడాదికి అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఒక్క భారత క్రికెటర్‌కు కూడా చోటు దగ్గలేదు. దీంతో ఘోర అవమానం జరిగినట్లు అయింది. టీ20 ప్రపంచకప్ 2021లో గ్రూపు దశలోనే నిష్క్రమించిన టీమ్ఇండియా.. గతేడాది పొట్టి ఫార్మాట్లో పెద్దగా రాణించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
కాగా ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్లో ముగ్గురు పాక్ ఆటగాళ్లకు చోటు లభించడం విశేషం. అంతేకాకుండా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను ఐసీసీ కెప్టెన్‌గా ఎంచుకుంది. బాబర్‌తో పాటు గతేడాది టీ20ల్లో రాణించిన పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, పేసర్ షాహిన్ ఆఫ్రిదిలకు ఈ జట్టులో చోటు దక్కింది. కాగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్టుల నుంచి ఇద్దరు చొప్పున ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు లభించింది.
ఐసీసీ టీ20 టీమ్