ఐసీసీ.. 2022 సంవత్సరానికిగానూ తమ అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. గతేడాది టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుని 11 మంది ఆటగాళ్ల పేర్లను తెలిపింది. ఇందులో ముగ్గురు టీమ్‌ఇండియా ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఈ జాబితాలో ఉన్నారు.
ఐసీసీ టీ20 జట్టు 2022.. జోస్ బట్లర్ (కెప్టెన్, ఇంగ్లాండ్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), విరాట్ కోహ్లీ (భారత్) , సూర్యకుమార్ యాదవ్ (భారత్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్, సికిందర్ రజా (జింబాబ్వే), హార్దిక్ పాండ్య (భారత్), సామ్ కరన్ (ఇంగ్లాండ్), వానిందు హసరంగ (శ్రీలంక), హారిస్ రవూఫ్ (పాకిస్థాన్), జోష్ లిటిల్ (ఐర్లాండ్).