తెలంగాణ

telangana

ETV Bharat / sports

అగ్రస్థానం కోల్పోయిన బాబర్​.. సూర్య డౌన్​.. రోహిత్​ పైపైకి.. మరి నెం.1? - asia cup 2022

ICC T20 Ranking : ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్​లో సూర్యకుమార్​ యాదవ్ కిందకు పడిపోయాడు. దీర్ఘకాలంగా నెం.1 స్థానంలో కొనసాగిన పాక్​ ఓపెనర్​ బాబార్​ అజామ్​ కూడా తొలి స్థానాన్ని కోల్పోయాడు. టీమ్​ ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ 4 స్థానాలు ఎగబాకాడు. మరి నెం.1 టీ-20 బ్యాటర్​ ఎవరో తెలుసా? ​

ICC T20I Rankings
ICC T20I Rankings

By

Published : Sep 7, 2022, 9:58 PM IST

ICC T20 Ranking : ఆసియా కప్‌ జరుగుతున్న వేళ టీ20 ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. హాంకాంగ్‌ మినహా పాకిస్థాన్‌తో పాటు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ రాణించలేకపోయిన భారత యువ కెరటం సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక స్థానం కిందకు పడిపోయాడు. ప్రస్తుతం నాలుగో స్థానానికి చేరాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 41 బంతుల్లోనే 72 పరుగులు చేసిన భారత్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకొని 13వ స్థానంలో నిలిచాడు. విరాట్​ కోహ్లీ 29 స్థానంలో ఉన్నాడు.

అయితే, బ్యాటింగ్‌ జాబితాలో ఇప్పటి వరకు నం.1 స్థానంలో కొనసాగిన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ స్థానం గల్లంతైంది. పాకిస్థాన్‌కే చెందిన మరో ఓపెనర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. ఆసియా కప్‌లో ఆడిన మూడు మ్యాచ్​ల్లోనూ రాణించి, 192 పరుగులతో టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచిన రిజ్వాన్‌ 815 రేటింగ్‌ పాయింట్లతో నం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో బాబర్‌ 794 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికాకు చెందిన మార్‌క్రమ్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక, ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్యా ఐదో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో అఫ్గాన్‌ కెప్టెన్‌ మహ్మద్‌ నబీ 256 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌లో ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలింగ్‌ విభాగంలో ఏ భారత ఆటగాడు కూడా టాప్‌-10లో లేకపోవడం గమనార్హం.

ఇవీ చూడండి:ఇది ప్రపంచ కప్​ తెచ్చే జట్టేనా?.. ఒక్కసారిగా తగ్గిన ఆశలు!

టీమ్​ఇండియా ఓటములకు కారణం 19వ ఓవరా?

ABOUT THE AUTHOR

...view details