ఐసీసీ టీ20 తాజా ర్యాంకింగ్‌లను అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసింది. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (5), బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్(7) వారి స్థానాలను పదిలం చేసుకున్నారు.
ఈ విభాగంలో పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్.. తన కెరీర్లో తొలిసారిగా టాప్-10లోకి దూసుకొచ్చాడు. 5 స్థానాలను మెరుగుపరుచుకున్న రిజ్వాన్.. పదో స్థానాన్ని దక్కించుకున్నాడు. జింబాబ్వే సిరీస్‌లో అద్భుతంగా రాణించడం రిజ్వాన్‌కు కలిసొచ్చింది.