ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను(ICC Ranking T20) బుధవారం విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎనిమిదో స్థానానికి పడిపోగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్(KL Rahul news) 5వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా చివరి మూడు మ్యాచ్‌ల్లో రాహుల్ అర్ధశతకాలతో అదరగొట్టాడు. దీంతో కోహ్లీని వెనక్కినెట్టి ఐదో స్థానానికి చేరుకున్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన మార్క్రమ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 25 బంతుల్లో 52 పరుగులు చేసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఉత్తమ టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలోనూ ఏడో స్థానానికి చేరుకున్నాడు మార్క్రమ్. మరో దక్షిణాఫ్రికా ఆటగాడు వాన్ డర్ డస్సెన్ ఉత్తమ ప్రదర్శనతో ఆరు స్థానాలు ఎగబాకి టాప్ 10లో చోటు సంపాదించుకున్నాడు.
టీ20 ఉత్తమ బ్యాటర్ల జాబితాలో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలన్ రెండో స్థానంలో నిలిచాడు.
బౌలర్లలో..
టీ20 ఉత్తమ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్. ఆస్ట్రేలియా సెమీస్ చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన జంపా ఐదో స్థానానికి చేరుకోగా.. హేజిల్‌వుడ్ ఏకంగా 11మందిని వెనక్కినెట్టి 8వ స్థానానికి చేరాడు. కివీస్ బౌలర్ టిమ్ సౌథీ 9వ స్థానంలో నిలిచాడు.