తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరల్డ్​ కప్​లు గెలవడం అంత సులువు కాదు- వచ్చే టీ20 ప్రపంచ కప్​ భారత్​దే! : రవి శాస్త్రి - టీ20 వరల్డ్ కప్ 2024 టీమ్ఇండియా రవిశాస్త్రి

ICC T20 World Cup 2024 Ravi Shastri : భారత్​ త్వరలో ఐసీసీ ట్రోఫీని ముద్దాడుతుందని టీమ్​ఇండియా మాజీ హెడ్​ కోచ్‌ రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంకా ఏన్నాడంటే?

ICC T20 World Cup 2024 Ravi Shastri
ICC T20 World Cup 2024 Ravi Shastri

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 10:27 PM IST

ICC T20 World Cup 2024 Ravi Shastri :వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచ కప్​ టైటిల్ టీమ్ఇండియా సొంతం చేసుకుంటుందని భారత జట్టు మాజీ కోచ్​ రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్​లో కప్‌లు గెలవడం అంత సులువు కాదని.. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్​ కప్‌లో టీమ్ఇండియా అత్యుత్తమంగా ఆడిందన్నారు. అయినప్పటికీ కీలకమైన ఫైనల్‌లో విఫలమైందని చెప్పాడు. 2023 ప్రపంచకప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్.. ఫైనల్‌లో ఆసీస్‌ చేతిలో ఓడిపోయింది.

''ఏదీ సులువుగా రాదు. సచిన్‌ తెందూల్కర్‌ లాంటి గొప్ప ప్లేయర్​కు ఆరో ప్రయత్నంలో వరల్డ్​ కప్‌ కల నెరవేరింది. వరల్డ్ కప్‌ సులువుగా గెలవలేరు. వరల్డ్​ కప్‌ గెలవాలంటే ఫైనల్‌లో గొప్పగా ఆడాలి. అంతకుముందు సాధించిన విజయాలు లెక్కలోకి రావు. కీలకమైన నాకౌట్ దశ, తుది పోరులో మంచి ప్రదర్శన చేయాలి. అప్పుడే విజేతగా నిలుస్తారు. ఈ వరల్డ్​ కప్‌లో ఆసీస్ సెమీస్, ఫైనల్‌లో బాగా ప్రదర్శన చేసింది. ఫైనల్ పోరులో టీమ్ఇండియా ఓడిపోవడం బాధ కలిగించింది. కానీ, దీని నుంచి మన ప్లేయర్లు పాఠాలు నేర్చుకుంటారు. భారత్‌ త్వరలో వరల్డ్ కప్ గెలవడం నేను చూస్తా. ఇది వన్డేల్లో కాకపోవచ్చు. ఎందుకంటే టీమ్​ను పునర్నిర్మాణం చేయాలి. కానీ, వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్​కప్‌లో టీమ్‌ఇండియా గట్టిపోటీదారు. ఇది పొట్టి ఫార్మాట్‌. అందులకే దీనిపై ఫోకస్‌ పెట్టాలి'' అని రవిశాస్త్రి సూచించాడు. వచ్చే ఏడాది జూన్‌లో వెస్టిండీస్, యూఎస్ఏ సంయుక్తంగా వరల్డ్​ కప్​ను నిర్వహించనున్నాయి.

ప్రస్తుతం టీమ్ఇండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్ ఆడుతోంది. మొత్తం యువకులతో నిండిపోయిన భారత జట్టు.. విశాఖపట్టణం వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియాపై 44 పరుగుల తేడాతో టీమ్ఇండియా గెలిచింది. అయితే యంగ్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, రింకూ రింగ్, బౌలర్ ముకేశ్ వంటి ప్లేయర్లు మంచి ఫామ్​లో ఉన్నారు. సూర్య కుమార్​ యాదవ్ అగ్రెసివ్​గా జట్టును నడిపిస్తున్నాడు. టీమ్ ఇదే ఫైర్​తో నిలకడగా, బ్యాలెన్స్​డ్​గా కొనసాగితే వచ్చే టీ20 వరల్డ్ కప్​ను భారత్​ ఒడిసిపట్టే అవకాశం ఉందని విశ్లేషకుల మాట. మరి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.

శుభ్​మన్​కు ప్రమోషన్​ - గుజరాత్ కొత్త కెప్టెన్​గా గిల్

'అలా బ్యాటింగ్ చేయడం సరదా నా రోల్ ఏంటో నాకు తెలుసు' ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్న రింకూ, ఇషాన్

ABOUT THE AUTHOR

...view details