ICC T20 World Cup 2022: భారత్- పాక్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరప్పా.. దాయాది దేశాల మధ్య పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే టీ20 వరల్డ్కప్ 2022లో భాగంగా భారత్- పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అక్టోబరు 23న మెల్బోర్న్లో జరగనుంది.
ఈ క్రమంలో ఈ మ్యాచ్ టికెట్లు గంటల వ్యవధిలోనే హాట్ కేకుల్లాగా అమ్ముడై పోయాయి. స్టేడియం పూర్తిసామర్థ్యం లక్ష మంది కాగా.. బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే టికెట్లు మొత్తం అమ్ముడై పోయినట్లు ఐసీసీ తన వెబ్సైట్లో పేర్కొంది.
టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్ 2 కేటగిరిలో ఉన్నాయి.