తెలంగాణ

telangana

By

Published : Jan 25, 2022, 3:01 PM IST

ETV Bharat / sports

మళ్లీ అగ్రస్థానంలోకి షెఫాలీ.. స్మృతి మంధాన డౌన్

ICC Women T20 Rankings: ఐసీసీ తాజా మహిళా టీ20 ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే స్మృతి మంధాన మరో ర్యాంకు కిందకు పడిపోయింది. కాగా, శ్రీలంక ప్లేయర్​ చమారీ అటపత్తు టాప్​-10లోకి దూసుకొచ్చింది.

ICC Women T20 Rankings
ICC Women T20 Rankings

ICC Women T20 Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా మహిళల టీ20 ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. ఇందులో టీమ్​ఇండియా స్టార్ బ్యాట్స్​ఉమెన్ షెఫాలీ వర్మ (726 పాయింట్లు) మళ్లీ ఫామ్​లోకి వచ్చింది. అగ్రస్థానానికి చేరుకుంది. స్మృతి మంధాన(709) ఓ స్థానం కిందకి పడిపోయి నాలుగో ర్యాంకులో నిలిచింది. బెత్​ మూనీ(724), మెగ్​ లానింగ్​(714) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. శ్రీలంక ప్లేయర్​ చమారీ అటపత్తు(632) ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి టాప్​-10లోకి దూసుకొచ్చి ఎనిమిదో స్థానంలో నిలిచింది.

టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్​

బౌలింగ్ విభాగంలో దీప్తిశర్మ(658) నాలుగో స్థానంలో ఉండగా.. రాజేశ్వరి గైక్వాడ్​(637) పదో ర్యాంకులో నిలిచారు. తొలి రెండు స్థానాల్లో ఇంగ్లాండ్​ ఆటగాళ్లు సోఫీ ఎక్లీస్టోన్​(761), సారా గ్లెన్​(122) ఉన్నారు.

టీ20 బౌలింగ్​ ర్యాంకింగ్స్​

ఆల్​రౌండర్​ విభాగంలో దీప్తి శర్మ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. 315 పాయింట్లతో మూడో ర్యాంకుకు చేరుకుంది. తొలి రెండు స్థానాల్లో సోఫీ డివైన్​(న్యూజిలాండ్​, 370 పాయింట్లు) నటాలి సీవర్​(ఇంగ్లాండ్​,​ 352 పాయింట్లు) ఉన్నారు.

టీ20 ఆల్​రౌండర్​ ర్యాంకింగ్స్​

ABOUT THE AUTHOR

...view details