ICC stop clock Rule For Bowlers :ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్- ఐసీసీ కొత్త రూల్ తీసుకొచ్చింది. బౌలర్ ఒక ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడానికి విధించిన 60 సెకన్ల పరిమితిని మూడోసారి దాటితే.. 5 పరుగుల పెనాల్టీ విధిస్తామని ప్రకటించింది. అయితే ఈ 'స్టాప్ క్లాక్' నియమాన్ని 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు పురుషుల వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఐసీసీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే ఓవర్ల మధ్యలో తీసుకునే సమయాన్ని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
అండర్ 19 వరల్డ్ వేదిక మార్పు..
Under 19 World Cup 2024 Venue :మరోవైపు.. శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసిన కారణంగా.. ఆ దేశంలో జరగాల్సిన అండర్ 19 వరల్డ్ కప్‌ను.. దక్షిణాఫ్రికాకు మార్చుతూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ జోక్యం లేకుండా క్రికెట్ వ్యవహారాలను మేనేజ్ చేయడంలో శ్రీలంక క్రికెట్ బోర్డు విఫలమైంది. ఈ కారణంగా ఐసీసీ.. ఎస్ఎల్సీపై ఇటీవల సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తాజాగా.. శ్రీలంక జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనవచ్చని తెలిపింది. అంతేకాకుండా ఇక నుంచి ఎస్ఎల్సీ వ్యవహారాలను ఐసీసీ చూసుకోనుందని తెలిపింది.
పిచ్ బ్యాన్ ప్రక్రియలో మార్పు..
అంతర్జాతీయ క్రికెట్‌లో పిచ్‌ను నిషేధించే ప్రక్రియలో కూడా ఐసీసీ మార్పులు చేసింది. 'పిచ్, ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ నిబంధనలకు మార్పులు కూడా పాలక మండలి ఆమోదించింది.' అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.