తెలంగాణ

telangana

ETV Bharat / sports

డైనోసర్‌లా 'పంత్‌'.. టీ20 వరల్డ్​కప్​ ప్రోమోతో ఐసీసీ సర్​ప్రైజ్​! - ICC t20 worldcup promo panth video

ICC Promo Panth Video: తనదైన శైలిలో బ్యాట్​తో అదరగొడుతున్న టీమ్​ఇండియా బ్యాటర్​ రిషభ్​ పంత్​కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ రిలీజ్​ చేసిన 2022 టీ20 వరల్డ్​కప్​ ప్రోమోలో పంత్​ను​ డైనోసర్​లా పైకి లేచి వస్తున్నట్లు చూపించింది. అభిమానులకు తెగ నచ్చేస్తున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.

ICC Promo Panth Video
ICC Promo Panth Video

By

Published : Jul 10, 2022, 8:20 PM IST

ICC Promo Panth Video: కొంతకాలంగా తన బ్యాట్‌తో అదరగొడుతున్న రిషభ్‌ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2022 టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి సంబంధించి ఐసీసీ ఆదివారం విడుదల చేసిన కొత్త ప్రోమోలో అతడిని అనూహ్యరీతిలో పరిచయం చేసింది. సిడ్నీ హార్బర్‌లోంచి అతడు డైనోసర్‌లా పైకి లేచి వస్తున్న వీడియోను పంచుకుంది.

ఐసీసీ ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే రిషభ్‌ పంత్‌ను మెగా టోర్నీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆ పోస్టులో 'Welcome to the Big Time, Rishabh Pant' అని పేర్కొంది. ఇది ప్రస్తుతం టీమ్‌ఇండియా అభిమానులకు తెగ నచ్చేస్తోంది.

ఇదీ చదవండి:బక్కోడే కానీ.. గట్టోడు! 'స్వింగ్‌' కింగ్‌ భువీ అరుదైన రికార్డ్!!

ABOUT THE AUTHOR

...view details