తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్​లో రెండోస్థానానికి సూర్య.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?

ICC Rankings : ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్​లో 837 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు టీమ్ ఇండియా ప్లేయర్​ సూర్యకుమార్​ యాదవ్. మొదటి స్థానంలో 854 పాయింట్లతో పాకిస్థాన్​కు చెందిన ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. మొదటి స్థానం వస్తుందని ఆశించినా.. దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్​లో చేసిన పేలవ ప్రదర్శనతో మొదటి స్థానం చేజార్చుకున్నాడు.

ICC Rankings
ICC Rankings

By

Published : Oct 5, 2022, 7:17 PM IST

ICC Rankings : టీమ్​ ఇండియా ఆటగాడు సూర్యకుమార్​ యాదవ్​ టీ20 ర్యాంకింగ్​లో తొలి స్థానాన్ని కోల్పోయాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో 837 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో 854 పాయింట్లతో పాకిస్థాన్​కు చెందిన ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్​కు ఇద్దరి మధ్య కేవలం 16 పాయింట్ల తేడా ఉంది.

ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్​లో అద్భుత ప్రదర్శన చేశాడు సూర్య కుమార్​ యాదవ్. మూడు మ్యాచ్​ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ ప్రదర్శనతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలోనే ఉంటాడని భావించినా.. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. పాకిస్థాన్​ ప్లేయర్​ రిజ్వాన్ మాత్రం ఇంగ్లాండ్​ సిరీస్​లో అదరగొట్టాడు. దాంతో మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో పేలవ ప్రదర్శన చేశాడు సూర్యకుమార్​. దీంతో రెండో స్థానానికి పడిపోయాడు. భారత్​ ఈ మ్యాచ్​లో 49 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

కాగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 801 పాయింట్లతో 3వ ర్యాంకులో ఉన్నాడు. మరోపక్క దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్కక్రమ్ నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ ప్లేయర్ డేవిడ్ మలన్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. టీమ్ ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో 108 పరుగులతో మెరుగ్గా ఆడాడు. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్​లో 3 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకుకు చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా 8 స్థానాలు పైకెక్కి 12వ ర్యాంకులో నిలిచాడు. మూడో టీ20లో అద్బుత శతకం సాధించిన రిలీ రొసో 23 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరుకున్నాడు. డేవిడ్ మిల్లర్ 10 స్థానాలు మెరుగుపరచుకుని 29వ ర్యాంకులో నిలిచాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ :

ర్యాంకు బ్యాటర్లు పాయింట్లు
1. మహమ్మద్ రిజ్వాన్(పాకిస్థాన్) 854 పాయింట్లు
2. సూర్యకుమార్ యాదవ్(భారత్) 838 పాయింట్లు
3. బాబర్ ఆజమ్(పాకిస్థాన్) 801 పాయింట్లు
4. ఎయిడెన్ మార్కక్రమ్(సౌతాఫ్రికా) 777 పాయింట్లు
5. డేవిడ్ మలన్(ఇంగ్లాండ్) 733 పాయింట్లు

ఇవీ చదవండి:టీ20 వరల్డ్​ కప్​ ఫైనల్​లో నిలిచే జట్లు ఇవేనా?

బుమ్రా స్థానంలో ఎవరు అన్నది అప్పుడే నిర్ణయిస్తాం: రోహిత్‌

ABOUT THE AUTHOR

...view details