తెలంగాణ

telangana

ETV Bharat / sports

ICC Rankings: మెరుగుపడిన అశ్విన్​.. మరి కోహ్లీ, రోహిత్?​​ - విరాట్​ కోహ్లీ

ICC Rankings: ఐసీసీ కొత్తగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​.. బ్యాటింగ్​ విభాగంలో భారత క్రికెట్​ జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మ, విరాట్​ కోహ్లీ తమ స్థానాలను కోల్పోయారు. అయితే వన్డేల్లో మాత్రం మెరుగుపరుచుకున్నారు. ఇక ఆల్​రౌండర్​ విభాగంలో రవిచంద్రన్​ అశ్విన్ తన ర్యాంకును మెరుగుపరుచుకుని మరింత ముందుకు జరిగాడు. ​

ICC Rankings:
ICC Rankings:

By

Published : Mar 30, 2022, 5:18 PM IST

ICC test Rankings: ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్​ బ్యాటింగ్‌ విభాగంలో టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక్క స్థానం దిగజారి 754 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. కోహ్లీ కూడా ఒక స్థానం కిందకి పడిపోయి 742 పాయింట్లతో పదో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ 901 పాయింట్లతో తొలి స్థానాన్ని నిలుపుకోగా.. టీమ్​ఇండియా స్పిన్నర్‌ అశ్విన్‌ 850 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమ్​ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా 385 పాయింట్లతో మరోసారి నెంబర్‌వన్‌గా నిలిచాడు. విండీస్‌ ప్లేయర్​ జేసన్‌ హోల్డర్‌ను వెనక్కినెట్టి టీమ్​ఇండియా మరో ఆల్​రౌండర్​ రవిచంద్రన్​ అశ్విన్​ 341 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్:వన్డే ర్యాంకింగ్స్ బ్యాటింగ్​ విభాగంలో టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ ఒక్క స్థానం ఎగబాకాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్​ క్వింటన్​ డికాక్​ను వెనక్కి నెట్టి 791 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. విరాట్​​ కోహ్లీ తన రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. పాక్​ సారథి బాబర్​ ఆజామ్​ 872 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక, బౌలింగ్​ విభాగంలో భారత జట్టు బౌలర్​ జస్ప్రీత్​ బుమ్రా 679 పాయింట్లతో తన ఆరో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఆల్​రౌండర్ల​ జాబితాలో బంగ్లాదేశ్​ ఆటగాడు షకీబుల్​ హసన్​ 419 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. టీమ్​ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా 224 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచాడు.

ఇదీ చదవండి:దిల్లీ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు!

ABOUT THE AUTHOR

...view details