తెలంగాణ

telangana

ETV Bharat / sports

ICC Rankings: మరోసారి నెం.1గా జడ్డూ.. రోహిత్​ డౌన్​ - విరాట్​ కోహ్లీ

ICC Rankings: ఐసీసీ కొత్తగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో భారత జట్టు ఆటగాడు రవీంద్ర జడేజా మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, వన్డే ర్యాంకింగ్స్​ టీమ్​ఇండియా మాజీ సారథి కోహ్లీ తన స్థానాన్ని కాపాడుకోగా.. కెప్టెన్​ రోహిత్​ శర్మ కిందకు పడిపోయాడు.

icc rankings
jadeja

By

Published : Mar 23, 2022, 6:55 PM IST

ICC Rankings: ఐసీసీ తాజా వన్డే, టెస్టు ర్యాంకింగ్స్​ను ప్రకటించింది. వన్డే ర్యాంకింగ్స్​లోని బ్యాటింగ్​ విభాగంలో దక్షిణాఫ్రికా ప్లేయర్​ క్వింటన్​ డికాక్​.. కెప్టెన్ రోహిత్​ శర్మను వెనక్కినెట్టి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. బ్యాటర్​ కోహ్లీ తన రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. పాక్​ సారథి బాబర్​ ఆజామ్​ అగ్రస్థానంలో నిలిచాడు.

బౌలింగ్​ విభాగంలో భారత జట్టు బౌలర్​ జస్ప్రీత్​ బుమ్రా తన ఆరో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఆల్​రౌండర్ల​ జాబితాలో బంగ్లాదేశ్​ ఆటగాడు షకీబుల్​ హసన్​ తొలి స్థానంలో ఉండగా.. టీమ్​ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా ఒక్క స్థానం దిగజారి 10వ స్థానంలో నిలిచాడు.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​..

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమ్​ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా మరోసారి నెంబర్‌వన్‌గా నిలిచాడు. 385 పాయింట్లతో జడ్డూ తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో విండీస్‌ ప్లేయర్​ జేసన్‌ హోల్డర్‌ ఉన్నాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక స్థానం దిగజారి 754 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా.. కోహ్లీ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ 885 పాయింట్లతో తొలి స్థానాన్ని నిలుపుకోగా.. టీమ్​ఇండియా స్పిన్నర్‌ అశ్విన్‌ 850 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదీ చదవండి: రాహుల్​కు గౌతీ వార్నింగ్​.. ఐపీఎల్​లో​ కెప్టెన్​గా ఉన్నంత మాత్రాన..!

ABOUT THE AUTHOR

...view details