జులై నెలకు సంబంధించి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' (ICC POTM) నామినీలను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC). ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించింది ఐసీసీ.
"జులై నెలకు గానూ పురుషుల క్రికెట్ నుంచి షకిబుల్ హసన్ (బంగ్లాదేశ్), మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా), హేడెన్ వాల్ష్ జూనియర్‌ను (వెస్టిండీస్) ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలుగా ఎంపిక చేశాం. మహిళల నుంచి హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), ఫాతిమా సనా (పాకిస్థాన్), స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్) పేర్లను పరిగణనలోకి తీసుకున్నాం" అని ఐసీసీ వెల్లడించింది.
షకిబుల్ హసన్..
బంగ్లా సీనియర్ ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్ గత నెల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌ను తన జట్టు గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. రెండో వన్డేలో 96 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. టీ20 సిరీస్‌లో 3 వికెట్లు తీసి బంతితోనూ సత్తా చాటాడు.
మిచెల్ మార్ష్..
గత నెల విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో పాటు.. ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో మిచెల్ మార్ష్ ఆడాడు. పొట్టి సిరీస్‌లో 219 పరుగులు చేసిన అతడు బౌలింగ్‌లో 8 వికెట్లు తీసుకున్నాడు.
హేడెన్ వాల్ష్ జూనియర్..
విండీస్ లెగ్ స్పిన్నర్ హేడెన్ వాల్ష్ గత నెల ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 7 వికెట్లతో రాణించాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 12 వికెట్లు తీశాడు. ఈ రెండు సిరీస్‌ల్లో విండీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు.