తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్లేయర్ ఆఫ్‌ ది అక్టోబర్‌ మంత్‌'గా రచిన్ రవీంద్ర - ఆ స్టార్​ పేసర్​ను దాటి! - హీలీ మాథ్యూస్‌ ప్లేయర్​ ఆఫ్​ ద మంత్​

ICC Player Of The Month : వరల్డ్‌ కప్‌ జరుగుతున్న వేళ ప్లేయర్‌ ఆఫ్ ది అక్టోబర్‌ మంత్' అవార్డులను ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో పురుషల,మహిళల విభాగం నుంచి రచిన్‌ రవీంద్ర, హీలీ మాథ్యూస్‌ ఈ అవార్డులను అందుకున్నారు.

ICC Player Of The Month
ICC Player Of The Month

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 2:02 PM IST

Updated : Nov 10, 2023, 5:36 PM IST

ICC Player Of The Month : అక్టోబర్ నెలకుగాను 'ప్లేయర్‌ ఆఫ్ ది మంత్' అవార్డులను ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో పురుషుల క్రికెట్‌ విభాగంలో కివీస్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్ర ఈ అవార్డును దక్కించుకున్నాడు. అయితే ఈ రేసులో టీమ్ఇండియా ప్లేయర్ జస్ప్రీత్​ బుమ్రాతోపాటు దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్‌ ఉన్నారు. కానీ వీరిద్దరిని దాటుకుని రచిన్ ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా రచిన్‌ రవీంద్ర ఆనందం వ్యక్తం చేశాడు. " ఈ అవార్డు అందుకోవడం పట్ల నాకెంతో గర్వంగా ఉంది. అంతేకాకుండా అక్టోబర్‌ నెల నాకు ఎంతో ప్రత్యేకం. భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ ఆడటం మరింత సంతోషకరం" అని రచిన్‌ వ్యాఖ్యానించాడు.

Rachin Ravindra World Cup Stats :ప్రస్తుత వరల్డ్​కప్​లో యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 9 మ్యాచ్​లు ఆడిన రచిన్.. 70.62 సగటుతో 565 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో టోర్నీలో అత్యధిక పరుగులు నమోదు చేసిన జాబితాలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు రచిన్.

సచిన్ రికార్డు బ్రేక్.. సింగిల్ వరల్డ్​కప్ ఎడిషన్​లో 500+ పరుగులు సాధించిన అతిపిన్న వయస్కుడిగా రచిన్ (565 పరుగులు) నిలిచాడు. అతడు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (523 పరుగులు) ను అధిగమించాడు. బ్యాటింగ్​లోనే కాకుండా రచిన్.. అటు బౌలింగ్​లోనూ రాణిస్తున్నాడు. ఈ టోర్నీలో అతడు 7 వికెట్లు పడగొట్టాడు.

Healy Matthews :మరోవైపు మహిళల విభాగంలో వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాటర్ హీలీ మాథ్యూస్‌ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో 99*, 132, 79 పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌'గానూ హీలీ నిలిచింది. బ్యాటింగ్​లోనే కాకుండా బౌలింగ్‌లోనూ 3/36 ప్రదర్శనతో ఆసీస్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు టీ20 సిరీస్‌లో హీలీనే టాప్‌ స్కోరర్‌ అలాగే టాప్‌ వికెట్‌ టేకర్‌ కూడా కావడం గమనార్హం. ఇక హీలీతో పాటు ఈ పోటీలో బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ నహిదా అక్తెర్, న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్ అమెలీ కెర్‌లు ఉన్నారు.

ఇలాంటి సపోర్ట్​ను నేను కలలో కూడా ఊహించలేదు - ఆ క్యాచ్​ నాకు ఎంతో స్పెషల్​!

రఫ్పాడించిన రచిన్ - తెందూల్కర్​ రికార్డు బ్రేక్, తొలి కివీస్ బ్యాటర్​గా రికార్డ్

Last Updated : Nov 10, 2023, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details