ICC On World Cup Pitch : మరి కొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. భారత్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 5 నుంచి ఇది షూరు కానుంది(ODI World cup Schedule). అయితే భారత్‌తో పాటు మిగిలిన ఆసియా దేశాల పిచ్‌లు.. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందనే వాదన చాలా కాలంగా బలంగా వినిపిస్తోంది.
ముఖ్యంగా అక్టోబర్, నవంబర్‌లలో భారత్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో స్పిన్నర్లు పాత్ర కీలకంగా ఉంటుందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. టాస్ కీలకంగా మారనుందని, టాస్ నెగ్గి సెకండ్ బ్యాటింగ్ ఎంచుకునే టీమ్స్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అలాగే ఈ ప్రపంచకప్‌లో పేసర్లు పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని కూడా చెబుతున్నారు.
అందుకే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న మన పిచ్‌లపై ఐసీసీ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం అందింది. బౌండరీ దూరం పెంచి.. పిచ్‌లపై గ్రాస్ ఎక్కువగా ఉండేలా చూడాలని క్యూరెటర్స్‌కు కొన్ని మార్గదర్శకాల్ని జారీ చేసినట్లు తెలిసింది. కాగా, ప్రస్తుతం భారత్‌లోని స్టేడియాల్లో బౌండరీ దూరం 65 మీటర్లుగా ఉంటుంది. ఇప్పుడా ఆ దూరాన్ని ఐదు మీటర్లు పెంచి 70 మీటర్లు ఉండాలని క్యూరెటర్స్‌కు ఐసీసీ చెప్పినట్లు తెలిసింది.
అలాగే పిచ్‌పై గ్రాస్ ఎక్కువగా ఉండేలా చేయడం వల్ల.. స్పిన్సర్లతో పాటు పేసర్లు కూడా మ్యాచ్‌పై పట్టు బిగించే ఛాన్స్ ఉంటుందని ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందట. మొత్తంగా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌కు అనుకూలంగా ఉండేలా పిచ్‌లను తయారు సిద్ధం చేయడానికి క్యూరెటర్స్‌తో ఐసీసీ చర్చిస్తున్నట్లు సమాచారం అందింది. సమాచారం.
ప్రపంచకప్ భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్,విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జన్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్..