ICC ODI Team of 2021: ఐసీసీ 2021 ఏడాదికి అత్యుత్తమ వన్డే జట్టును ప్రకటించింది. టీ20 జట్టు మాదిరిగానే.. వన్డే జట్టులోను ఒక్క భారత ఆటగాడికీ చోటు లభించలేదు.
పాకిస్థాన్ సారథి బాబర్ ఆజామ్‌ను వన్డే జట్టుకు కెప్టన్‌గా ఎంపిక చేసింది ఐసీసీ. మరో పాక్ ఆటగాడు ఫకార్ జమాన్‌కు కూడా జట్టులో చోటు కల్పించింది.
వీరితో పాటు.. ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, ఇద్దరు శ్రీలంక ప్లేయర్స్, ముగ్గురు బంగ్లాదేశ్ ఆటగాళ్లకు జట్టులో చోటు లభించింది.
ఐసీసీ వన్డే జట్టు 2021:పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్), జానెమన్ మలన్(దక్షిణాఫ్రికా), బాబర్ ఆజామ్(పాకిస్థాన్), ఫకార్ జమాన్(పాకిస్థాన్), వాన్ డర్ డసెన్(దక్షిణాఫ్రికా), షకిబ్ అల్ హసన్(బంగ్లాదేశ్), ముషాఫికర్ రహీమ్(బంగ్లాదేశ్), వానిందు హసరంగ(శ్రీలంక), ముస్తాజిఫర్ రహ్మాన్(బంగ్లాదేశ్), సిమి సింగ్(ఐర్లాండ్), దుశ్మంత చమీర(శ్రీలంక).
భారత మహిళా క్రికెటర్లు