తెలంగాణ

telangana

ETV Bharat / sports

వ‌న్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి భార‌త్.. ఆసీస్​ను వెనక్కి నెట్టి.. - ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​అప్డేట్లు

ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో భార‌త్ మూడో స్థానానికి చేరింది. వరుస‌గా రెండు వ‌న్డేల్లో ఓట‌మి పాల‌వ్వ‌డంతో కివీస్ రెండో స్థానానికి ప‌డిపోయింది.

ICC ODI Rankings
ICC ODI Rankings

By

Published : Jan 21, 2023, 10:09 PM IST

ICC ODI Rankings Team India: ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో భార‌త్ మూడో స్థానానికి ఎగ‌బాకింది. రెండో వ‌న్డేలో ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి ర్యాంకింగ్‌ను మెరుగుప‌రుచుకుంది. వ‌రుస‌గా రెండు వ‌న్డేల్లో ఓట‌మి పాల‌వ్వ‌డంతో ఆ జ‌ట్టు రెండో స్థానానికి ప‌డిపోయింది.

భార‌త సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ 115 రేటింగ్ పాయింట్ల‌తో మొదటి స్థానంలో ఉండేది. ఇంగ్లాండ్ 113 రేటింగ్ పాయింట్ల‌తో రెండు, ఆస్ట్రేలియా 112 పాయింట్లతో మూడు, భార‌త్ 111 పాయింట్ల‌తో నాలుగో స్థానంలో ఉండేవి. భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌లో ఓట‌మితో కివీస్ రెండో స్థానానికి, ఇంగ్లాండ్ ప్ర‌థమ స్థానానికి చేరాయి. ఆస్ట్రేలియా నాలుగు, పాకిస్థాన్ ఐదో ప్లేస్‌లో నిలిచాయి. మూడో వ‌న్డేలో కివీస్‌ను ఓడిస్తే భార‌త్‌ నంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరే అవ‌కాశం ఉంది.

రాయ్‌పుర్‌లో జ‌రిగిన రెండో వ‌న్డేలో టీమ్​ఇండియా ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త బౌల‌ర్లు షమీ, పాండ్యా, సుంద‌ర్ చెల‌రేగ‌డంతో కివీస్‌ను 108 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. రోహిత్ శ‌ర్మ 51, శుభ్‌మ‌న్ గిల్ 40 ర‌న్స్‌తో రాణించారు. దాంతో 20.1 ఓవ‌ర్‌లోనే రెండు వికెట్ల న‌ష్టానికి ల‌క్ష్యాన్ని ఛేదించింది. మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. మూడో వ‌న్డే జ‌న‌వ‌రి 24న ఇందోర్‌లో జ‌ర‌గ‌నుంది.

ABOUT THE AUTHOR

...view details