ICC ODI Rankings 2023 :ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) బుధవారం వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 863 పాయింట్లతో టాప్‌లోనే కొనసాగుతున్నాడు. భారత యువ సంచలనం శుభ్‌మన్ గిల్ (759 పాయింట్లు) తన రెండో స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. ఇక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 707 పాయింట్లతో తొమ్మిదో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (715 పాయింట్లు).. ఒక ప్లేస్ పడిపోయి ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
టాప్ 5 బ్యాటర్లు
- శుభ్‌మన్ గిల్ (భారత్) 759 పాయింట్లు
- రస్సీ వాన్ డర్ డస్సెన్ (సౌతాఫ్రికా) 745 పాయింట్లు
- డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 739 పాయింట్లు
- ఇమామ్ ఉల్ హక్ (పాకిస్థాన్) 735 పాయింట్లు.
నాలుగేళ్లలో తొలిసారి.. తాజా ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ముగ్గురు టీమ్ఇండియా బ్యాటర్లు (గిల్, విరాట్, రోహిత్) ఉన్నారు. ఇలా వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో భారత్ నుంచి ముగ్గురు ప్లేయర్లు చివరిసారిగా 2019 జనవరిలో చోటు దక్కించుకున్నారు. అప్పుడు రోహిత్, విరాట్, శిఖర్ ధావన్ ఈ ముగ్గురు టాప్ 10లో స్థానం సంపాదించారు. ఆ తర్వాత మరెప్పుడు కూడా ఈ జాబితాలో టీమ్ఇండియా నుంచి ముగ్గురు బ్యాటర్లు టాప్ 10లో లేరు.
10లో ఆరుగురు భారత్-పాకిస్థాన్ ప్లేయర్లు..
ఈ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో భారత్,పాకిస్థాన్ బ్యాటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లిస్ట్‌లో ఇరుజట్ల నుంచి ఆరుగురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. పాక్ నుంచి బాబర్ అజామ్, ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్ (705 పాయింట్లు).. భారత్ నుంచి గిల్, విరాట్, రోహిత్ ఉన్నారు.