ICC ODI Ranking Team 2023 :ఐసీసీ(అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) ఆదివారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో.. ఆస్ట్రేలియాటాప్లోకి దూసుకెళ్లింది. 121 పాయింట్లతో ఆసిస్.. పాకిస్థాన్ (120 పాయింట్ల)ను వెనక్కినెట్టి అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. ఇక 114 పాయింట్లతో భారత్.. మూడో స్థానంలో కొనసాగుతోంది.
గతేడాది శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన ఆసీస్.. ఆ తర్వాత వేగం పుంజుకుంది. అసాధారణ ఆటతీరుతో ఆ తర్వాత సొంత గడ్డపై .. న్యూజిలాండ్ (3-0), ఇంగ్లాండ్ (3-0)ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఏడాది భారత్ పర్యటనలో కూడా 2-1 తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఆసిస్.. తాజాగా రెండు వరుస విజయాలు నమోదు చేసి.. నెం 1 జట్టుగా నిలిచింది. అయితే రెండో ప్లేస్‌లో ఉన్న పాకిస్థాన్.. ఆసియాకప్‌లో ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీంతో మళ్లీ ర్యాంక్ మారే అవకాశాలు ఉన్నాయి.
టాప్ 5లో ఉన్న జట్లు
- రెండో స్థానం.. పాకిస్థాన్ 120 పాయింట్లు
- మూడో స్థానం.. భారత్114 పాయింట్లు
- నాలుగో స్థానం. న్యూజిలాండ్ 106 పాయింట్లు
- ఐదో స్థానం.. ఇంగ్లాండ్ 99 పాయింట్లు
Australia Tour Of South Africa 2023: 5 వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా.. గతనెల సౌతాఫ్రికా పయనమైంది. ఈ పర్యటనలో ఆసిస్.. ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తోంది. ఇప్పటికే మొదలైన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసిస్ 3-0తో కైవసం చేసుకుంది. రీసెంట్గా ప్రారంభమైన వన్డేల్లోనూ అదే జోరు కనబరుస్తోంది.