ICC ODI Ranking 2023 :ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్.. బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో (678 రేటింగ్స్) నిలిచాడు. అతడు ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి.. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజెల్‌వుడ్ (678 రేటింగ్స్)ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు లేవు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ (857 రేటింగ్స్)తో తొలి స్థానంలో ఉండగా.. టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్(814 రేటింగ్స్)తో రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (708 రేటింగ్స్)తో ఎనిమిదో స్థానంలో ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (696 రేటింగ్స్)తో పదో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఒక్క మ్యాచ్‌తో 51 రేటింగ్స్.. 2023 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందుసిరాజ్.. 643 రేటింగ్స్‌తో తొమ్మిదో స్థానంలో కొనసాగాడు. అయితే శ్రీలంతో మ్యాచ్‌లో సిరాజ్ ఏకంగా 6 వికెట్లతో చెలరేగి.. కెరీర్ బెస్ట్ స్పెల్ నమోదు చేశాడు. అందులో తొలి నాలుగు వికెట్లు ఒకే ఓవర్లో పడగొట్టడం విశేషం. ఇక సిరాజ్ దెబ్బకు ముగ్గురు లంక బ్యాటర్లు పరుగుల ఖాతా తెరవలేకపోయారు. ఈ మ్యాచ్‌తో సిరాజ్.. 51 రేటింగ్ పాయింట్లు సంపాదించి, ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు. అయితే ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో నిలవడం సిరాజ్‌కు ఇది రెండోసారి.