అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా గ్రెగ్ బార్‌క్లే మరోసారి నియమితులయ్యారు. శనివారం జరిగిన ఐసీసీ సమావేశంలో గ్రెగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఐసీసీ ఛైర్మన్‌గా మళ్లీ ఆయనే - గ్రెగ్ బార్క్లే లేటెస్ట్ న్యూస్
ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్‌క్లే మరోసారి నియమితులయ్యారు. శనివారం జరిగిన ఐసీసీ సమావేశంలో గ్రెగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ 2020 నవంబరులో తొలిసారిగా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది నవంబరుతో ఆయన పదవీకాలం ముగియనుండగా.. ఛైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించారు. ఈ పదవికి జింబాబ్వేకు చెందిన తవెంగ్వా ముకులానీ కూడా పోటీ చేసినప్పటికీ.. చివరి నిమిషంలో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత బీసీసీఐ సహా 17 మంది ఐసీసీఐ బోర్డు సభ్యులు గ్రెగ్‌కు మద్దతివ్వగా.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రెగ్ గతంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. అంతకుముందు 2015లో ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్‌కప్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
ఇదీ చూడండి:టీమ్‌ఇండియా ఓటమిపై 'గిన్నిస్ వరల్డ్ రికార్డు' సెటైర్లు