అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతి నెలా పురుషుల, మహిళా క్రికెట్ విభాగంలో ఒకరికి 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' (జనవరి)అవార్డు ప్రకటిస్తుంది. అందుకోసం నామినేట్ అయిన వారిని ముందుగానే అనౌన్స్ చేస్తుంది. ఈసారి ఈ అవార్డుకు పురుషుల విభాగంలో భారత్ నుంచి శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ నామినేట్ అయ్యారు. మంచి ఫామ్‌లో ఉన్న ఈ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. వీరితో పాటు న్యూజిలాండ్ ఓపెనర్ డివోన్ కాన్వే కూడా నామినేట్ అయ్యాడు.
'ఐసీసీ ప్లేయర్ ఆప్ ది మంత్' నామినేషన్లు.. రేసులో టీమ్ఇండియా ప్లేయర్లు! - ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ మహ్మద్ సిరాజ్
'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు నామినేషన్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఓ బ్యాటర్, ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నారు. ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో అద్భత ఫామ్‌ను ప్రదర్శించిన ప్లేయర్లు.. ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. వారెవరంటే..
మెరిసిన గిల్..
ఫిబ్రవరి 1న న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో శుభ్‌మన్ గిల్ శతక ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ, న్యూజిలాండ్‌తో డబుల్ సెంచరీ సాధించి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు గిల్. అంతేకాక, భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ(122)ని శుభ్‌మన్ గిల్(126) వెనక్కినెట్టాడు.
'సూపర్' సిరాజ్..
ఇక టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ విషయానికొస్తే.. ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ఐసీసీ పురుషుల ర్యాంకింగ్స్‌లో.. వన్డేల్లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన వన్డేలో 7 ఓవర్ల కోటాలో 30 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ఆ తర్వాత జరిగిన వన్డేల్లో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్ల,32 పరుగులకు 4 వికెట్ల పడగొట్టాడు. దీంతో సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. ఆ తర్వాత హోం గ్రౌండ్ హైదరాబాద్ వేదికగా కివీస్‌తో జరిగిన థ్రిల్లింగ్ వన్డేలో 10 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్ల పడగొట్టాడు. ఆ తర్వాత నాగ్‌పుర్‌లో జరిగిన మ్యాచ్‌లో 6-1-10-1తో అద్భుత ప్రదర్శన చేశాడు.