ఇంగ్లాండ్-శ్రీలంక మధ్య జరుగుతోన్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో కరోనా కేసు వెలుగుచూసింది. ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఫిల్ విట్టికేస్కు కొవిడ్ నిర్ధరణ అయింది. శనివారం ఇరుజట్ల మధ్య జరిగిన మూడో టీ20లో ఫిల్ పాల్గొన్నాడు. అతనికి మహమ్మారి లక్షణాలేమీ లేనప్పటికీ వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
మళ్లీ కరోనా కలకలం.. శ్రీలంకతో సిరీస్ జరిగేనా? - మ్యాచ్ రిఫరీ ఫిల్ విట్టికేస్
ప్రపంచ క్రికెట్‌ను కరోనా వెంటాడుతోంది. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీలంకతో స్వదేశంలో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుదుతున్న ఇంగ్లాండ్‌కు షాక్ తగిలింది. శనివారం మూడో టీ20 జరగ్గా.. అందులో పాల్గొన్న ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఫిల్ విట్టికేస్కు కరోనా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.
ఇంగ్లాండ్ vs శ్రీలంక, మ్యాచ్ రిఫరీ విట్టికేస్కు కొవిడ్
మూడు టీ20లతో పాటు మూడు వన్డేల కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది లంక జట్టు. ఇప్పటికే పొట్టి సిరీస్ శనివారంతో ముగిసిపోయింది. 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది ఇంగ్లాండ్. సోమవారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కరోనా కేసు బయటపడిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. ఈ టూర్ అనంతరం స్వదేశంలో భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది శ్రీలంక.
ఇదీ చదవండి:యువ సంచలనం షెఫాలీ ఖాతాలో సరికొత్త రికార్డు