తెలంగాణ

telangana

ETV Bharat / sports

వన్డే ర్యాంకింగ్స్​లో శ్రేయస్ దూకుడు​, ధావన్ డీలా.. టాప్​ 5లో ఎవరున్నారంటే? - విరాట్​ కోహ్లీ ఐసీసీ వన్డే ప్లేయర్ల ర్యాంకింగ్స్

ఐసీసీ విడుదల చేసిన వన్డే ప్లేయర్ల ర్యాంకింగ్స్​లో శ్రేయస్ అయ్యర్​ అదరగొట్టాడు. మూడు స్థానాలు మొరుగుపర్చుకున్నాడు. టాప్​ 5లో ఎవరున్నారంటే..

ICC Mens ODI Players Rankings
ICC Mens ODI Players Rankings

By

Published : Oct 12, 2022, 8:46 PM IST

టీమ్ ఇండియా బ్యాటర్​ శ్రేయస్ అయ్యర్​ ఐసీసీ ర్యాంకింగ్స్​లో అదరగొట్టాడు. మూడు స్థానాలు మెరుగుపరచుకుని 33 స్థానంలో నిలిచాడు. మరోపక్క, బౌలింగ్​లో కుల్​దీప్ యాదవ్​ టాప్ 25లోకి వెళ్లాడు. ఈ మేరకు బుధవారం ఐసీసీ పురుషుల వన్డే ప్లేయర్ల ర్యాంకులను ప్రకటించింది.

ఇటీవల ముగిసిన భారత్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్​లో శ్రేయస్ మెరిశాడు. మూడు మ్యాచ్​ల్లో సఫారీలపై 191 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. కుల్​దీప్​ యాదవ్​ కూడా ఈ సిరీస్​లో బాగానే రాణించాడు. మొత్తం మూడు మ్యాచ్​ల్లో 6 వికెట్లు తీశాడు. భారత్​ నుంచి జస్​ప్రీత్​ బుమ్రా పదో స్థానంలో ఉన్నాడు. యజువేంద్ర చాహల్ 20వ స్థానంలో కొనసాగుతున్నాడు.

సంజు శాంసన్​ 93 ర్యాంకులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా సిరీస్​లో రాణించి.. మొత్తం 118 పరుగులు చేశాడు. మొదటి వన్డేలో 86 పరుగులు సాధించి అదరగొట్టాడు. కానీ ఆ మ్యాచ్​ భారత్ ఓటమి పాలైంది. అయితే ఈ ర్యాంకింగ్స్​లో 6 స్థానాలు కోల్పోయి వన్డే కెప్టెన్ శిఖర్ ధావన్ 17 స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే సిరీస్​ ఆడలేక పోయిన విరాట్​ కోహ్లీ. రోహిత్ శర్మ కొన్ని స్థానాలు కోల్పోయారు.

టీ20ల్లో టాప్​ 3లో సూర్య కూమార్​
ఇప్పటికే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్​, డేవిడ్ మిలన్​ను కిందికి నెట్టి న్యూజిలాండ్​కు చెందిన డెవాన్ కాన్వే 760 రేటింగ్ పాయింట్లతో టాప్​ 5 బ్యాటర్ల జాబితాలోకి చేరాడు. ప్రస్తుతం కాన్వే న్యూజిలాండ్​, బంగ్లాదేశ్, పాకిస్థాన్​ మధ్య జరుగుతున్న ముక్కోనపు సిరీస్​లో ఆడుతున్నాడు. ఈ సిరీస్​లో ఇప్పటి వరకు 219 పరుగులు చేసి ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్​గా నిలిచాడు. అందులో రెండు అర్ధ సెంచరీలు ఉండగా.. అత్యధికంగా 70 పరుగులు చేశాడు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా బ్యాటర్​ ఎయిడెన్ మార్​క్రమ్​ కంటే కొన్ని పాయింట్ల తేడాతో దిగువన ఉన్నాడు కాన్వే. మొదటి మూడు స్థానాల్లో ఉన్న మహ్మద్ రిజ్వాన్, సూర్య కుమార్ యాదవ్, బాబర్ ఆజమ్ వారి స్థానాలు కాపాడుకున్నారు. ఆల్​ రౌండర్ ర్యాంకింగ్స్​లో హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి స్థానంలో అఫ్గానిస్థాన్​కు చెందిన మహ్మద్​ నబి ఉన్నాడు. టీ20 ర్యాంకింగ్స్​లో బౌలింగ్​ విభాగంలో భువనేశ్వర్​ కుమార్ 13వ స్థానంలో ఉన్నాడు.

ఇవీ చదవండి :రెజ్లర్‌ సుశీల్‌కు బిగుస్తున్న ఉచ్చు.. హత్య, హత్యాయత్నం కింద అభియోగాలు

'విరాట్ కోహ్లీ లాంటోళ్లు ఎందరో.. అలా చేస్తేనే మానసిక ఒత్తిడిని జయించొచ్చు'

ABOUT THE AUTHOR

...view details